వారసత్వ హీరోలు.. వీళ్ల వల్ల దేశానికి ఏం ఉపయోగం: ఏకిపారేసిన కోటా శ్రీనివాసరావు

మెగా ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీ.. దగ్గుబాటి ఫ్యామిలీ.. మంచు ఫ్యామిలీ.. ఘట్టమనేని ఫ్యామిలీ.. ఇలా టాలీవుడ్‌లో అన్నీ ఫ్యామిలీ ప్యాక్‌లే ఉన్నాయి. ఒకరి తరువాత ఒకరు డజన్ల కొద్దీ ఇండస్ట్రీలోకి వస్తూనే ఉన్నారు.

వారసత్వంగా సినిమాల్లోకి వస్తున్న హీరోల వల్ల దేశానికి ఏం ఉపయోగం అని ప్రశ్నించారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు. సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన నెపోటిజమ్‌పై ఆయన మాట్లాడుతూ.. ‘అన్నిరంగాల మాదిరిగానే సినిమాల్లో కూడా వారసత్వం ఉంది. అదేం తప్పుకాదు కానీ.. రాను రాను ఎలా తయారైందంటే.. డబ్బులు ఉన్నాయి కదా కోట్లు కోట్లు అని.. చదువులు మానిపించేసి.. సంపాదించుకుంటాడులే అని సినిమాల్లోకి తోసేస్తున్నారు. ఇలాంటిది వద్దని అంటున్నా.

పెద్ద హీరోగారి అబ్బాయి.. బ్రహ్మాండంగా చదువుకోగలడు.. బోలెడు డబ్బులు కూడా ఉన్నాయి. చక్కగా చదువుకుని దేశానికి ఉపయోగపడాలి కానీ.. దేశం మీద ఆధారపడి దేశంపైనే డబ్బులు తీసుకుంటే నీ తెలివితేటలు దేశానికి ఏం ఉపయోగపడ్డట్టు.

నువ్వేం చేశావ్.. నువ్ దేశానికి ఏం చేశావ్ అని నన్ను అడగొచ్చు.. ఎస్ నేను ఉపయోగపడుతున్నా.. నా నటన వల్ల ప్రేక్షకుడు ఆనందపడుతున్నాడు. మిగతావాళ్లు అలా కాదు కదా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కోటా శ్రీనివాసరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కుర్రాళ్లకు కిక్ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ తొలి పాట..

Sat Jul 10 , 2021
యువ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. అవినీతికి .. అన్యాయాలకు ఆశ్రయం కల్పిస్తున్న రాజకీయాల చుట్టూ అల్లిన కథ ఇది. వీటిని ఎదురుకొని ఓ కాలేజీ కుర్రాడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ అనే పాటని చిత్ర యూనిట్ విడుదల చేశారు.