ఎన్ని రోజులైనా తగ్గని రాకీ భాయ్ క్రేజ్.. మరో మైలురాయి చేరుకున్న ‘కే.జీ.ఎఫ్-2’ టీజర్

ఒకప్పుడు బాహుబలి-2 సినిమా కోసం ఎంతలా ఎదురుచూశారో.. ఇప్పుడు ‘కే.జీ.ఎఫ్-2’ సినిమా కోసం అంతకంటే రెట్టింపుగా ఎదురుచూస్తున్నారు. భారత సినీ లోకంపై ‘రాకీ భాయ్’ చూపించిన ప్రభావం అలాంటిది. కాగా, కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ తాజాగా మరో మైలురాయిని చేరుకుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-1’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మాస్ ఫైటింగ్‌లు, అద్భుతమైన సెట్టింగ్‌లు, భారీగా ఎలివేషన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతీ అంశం యావత్ భారతదేశ్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుంది. అద్భుతమైన క్లైమాక్స్‌తో ముగిసిన ఈ సినిమా తదుపరి కథ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’లో తెలియనుంది. దీంతో ఒకప్పుడు బాహుబలి-2 కోసం ఎలా ఎదురుచూశారో.. ఇప్పుడు ఈ సినిమా కోసం అంతకంటే రెట్టింపుగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

తెరపై యశ్‌ని మరోసారిగా ‘రాకీ భాయ్‌’గా చూడాలని.. అతన్ని యాక్షన్‌ని చూస్తూ థియేటర్లలో ఈలలతో గోల చేయాలని ఎన్నో ప్లాన్లు వేశారు. నిజానికి అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ రోజు(జూలై 16న) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదాపడింది. సినిమా థియేటర్లు పూర్తిగా తెరుచుకొని.. మళ్లీ 100 శాతం ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్లకు వస్తారో.. అప్పుడే తమ సినిమాను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ ఆ మధ్య ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది.

కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ టీజర్ తాజాగా 200 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే బీజీఎమ్, యాశ్ యాక్షన్, ప్రశాంత్ నీల్ టేకింగ్.. ఇలా ప్రతీ అంశం టీజర్‌ను ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇక సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టండన్‌లో ఈ టీజర్‌లో ఒక క్షణం పాటు కనిపిస్తారు. అన్నిటికన్న క్లైమాక్స్ టీజర్‌కి హైలైట్ అని చెప్పుకోవాలి. తాజాగా ఈ టీజర్ 200 మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేయడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మీ గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి.. మా మాన్‌స్టర్‌కి తిరుగులేకుండా చేశారు’ అంటూ ట్వీట్ చేసింది. 200 మిలియన్ల వ్యూస్ దాటిన కే.జీ.ఎఫ్ 2 టీజర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టీఆర్ఎస్‌లోకి ఎల్.రమణ.. ఈయనకు త్వరలోనే గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ వెల్లడి

Fri Jul 16 , 2021
TRS Party News: తెలుగు దేశం పార్టీకి రాజీనామా సమర్పించిన రమణ.. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వం తీసుకున్న విష‌యం తెలిసిందే.