కేరళ హైకోర్టులో New IT Rules ఛాలెంజ్.. మీడియా ఛానెల్స్‌కు అనుకూలంగా తీర్పు

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ఐటీ నిబంధనల విషయంలో న్యూస్ ఛానెల్స్ తాజాగా కేరళ హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ వారికి అనుకూలంగా ఆదేశాలు జారీచేసింది.

ప్రధానాంశాలు:కొత్త ఐటీ నిబంధనలపై ఎన్‌బీఏ రిట్ పిటిషన్.ఎన్‌బీఏకు మద్దతు తెలిపిన కేరళ హైకోర్టుఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచనలు.కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛ, మీడియాను నియంత్రించేలా ఉన్నాయని ఆరోపిస్తూ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) కేరళ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. ఎన్‌బీఏకు అనుకూలంగా ఆదేశాలు వెలువరించింది. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు బలవంతపు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. భావప్రకటన స్వేచ్ఛ, మీడియాను అనూహ్యంగా పరిమితం చేయడానికి ప్రభుత్వ అధికారులకు కొత్త ఐటీ నిబంధనలు అధికారాన్ని కట్టబెడుతున్నాయని ఎన్బీఏ పేర్కొంది.

‘‘ఐటీ నిబంధనలు 2021.. ఏదైనా వృత్తి లేదా వాణిజ్యం, వ్యాపారంలో కొనసాగడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించి చట్టం ముందు అందరూ సమానం, ఆర్టికల్ 19 కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించేవిగా ఉన్నాయి’’ అని ఎన్‌బీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘డిజిటల్ న్యూస్ మీడియా కంటెంట్‌ను నియంత్రించడానికి అపరిమితమైన, హద్దులేని, ఎక్కువ అధికారాలను ఇచ్చే పర్యవేక్షణ యంత్రాంగాన్ని కొత్త ఐటీ నిబంధనలు సృష్టిస్తాయని’ ఎన్‌బీఏ తన పిటిషన్‌లో పేర్కొంది.

‘ఫిర్యాదుల పరిష్కార కోసం యంత్రాంగాన్ని సృష్టించి అప్పగించిన అధికారాలు మీడియా కంటెంట్‌పై కఠిన నియంత్రణ కలిగి ఉంటాయి.. ఈ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు ప్రత్యేక అధికారాలున్న న్యాయవ్యవస్థలోకి ప్రవేశించినట్టు ఉన్నాయి… అటువంటి అధికార పరిధిలోకి ప్రవేశించే అవకాశం ఉండదని రిట్ పేర్కొంది’ అని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కేంద్రం అమలు చేస్తున్న నిబంధనల్ని పాటించకపోతే చట్టపరమైన రక్షణ కోల్పోవాల్సి వస్తుందని ట్విట్టర్‌ను హైకోర్టు హెచ్చరించింది. కొత్త ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా హెచ్చరికలు చేశారు. ఐటీ నిబంధనలు అమలు విషయంలో ట్విట్టర్ చెబుతున్న కారణాలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించలేదు. కేంద్రం కోరుతున్న విధంగా ఐటీ రూల్స్ అమలు పర్యవేక్షణాధికారుల్ని కూడా నియమించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో ట్విట్టర్ తాత్కాలిక అధికారుల్ని నియమించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. వారిని తమకు అప్పగించిన బాద్యతలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

MS Dhoniని గౌరవించి.. 7కి రిటైర్మెంట్ ఇవ్వండి: సబా కరీమ్

Fri Jul 9 , 2021
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత చాలా రోజులకి అతని జెర్సీ నెం.10ని శార్ధూల్ ఠాకూర్‌ ధరించాడు. దాంతో.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా బీసీసీఐ ఆ జెర్సీ నెం.10కి రిటైర్మెంట్ ప్రకటించింది. తాజాగా ధోనీ విషయంలోనూ..