రాజ్‌భవన్‌లో కేరళ గవర్నర్ నిరాహార దీక్ష.. ఓ మంచి పనికోసం!

అక్షరాాస్యత, ఆయుఃప్రమాణం వంటి సామాజిక అంశాలలో ప్రశంసలందుకుంటోంది కేరళ.. అటువంటి చోట వరకట్న వేధింపులు, మహిళల పట్ట అఘాయిత్యాలు ఆ రాష్ట్రాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి

ప్రధానాంశాలు:మహిళలపై దురాచాలకు వ్యతిరేకంగా దీక్ష.దేశాన్ని కుదిపేసిన కేరళ యువతి విస్మయ ఘటన.వరకట్నం తీసుకోబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ‌.మహిళలపై జరుగుతున్న వేధింపులు, దురాచారాలకు వ్యతిరేకంగా కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కేరళలో ఇటీవల వరకట్న వేధింపుల ఘటనలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఇటీవల విస్మయ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా కదిలించింది. ఈ ఘటనపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురాచారంపై ప్రజల్లో అవగాహన కల్పించి, దానిని అంతం చేయాలన్న సంకల్పంతో గవర్నర్ నిరాహార దీక్షకు దిగారు.

రాజ్‌భవన్‌లో నిరాహార దీక్షను ఉదయం 8 గంటలకు ప్రారంభించి… సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు గాంధీభవన్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను విరమించారు. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా గాంధీ స్మారకం వద్ద పలు గాంధేయ సంఘాలు నిరసన దీక్షను చేపట్టాయి. వారి ఆందోళనకు సంఘీభావంగా గవర్నర్ సాయంత్రం అక్కడకు చేరుకుని దీక్షను విరమించారు. సాంఘిక దురాచారంపై ఓ గవర్నర్ నిరాహార దీక్షకు దిగడం కేరళలో చరిత్రలో ఇదే తొలిసారి.

దీక్ష విరమణ అనంతరం గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తాము వరకట్నం తీసుకోబోమని, అలాగే ఇవ్వబోమని ప్రమాణం చేస్తూ కళాశాల నుంచి ధ్రువపత్రాలు తీసుకునే సమయంలో విద్యార్థులు సంతకం చేయాలని సూచించారు. ఈ విషయమై రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు.

‘ఇటీవల రాష్ట్రంలో వరకట్నానికి ఓ మహిళ బలైపోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.. అక్షరాస్యత, ఆయుర్దాయం సహా సామాజిక సూచికలలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన మన కేరళలో వరకట్నం అనే వికారమైన సంప్రదాయాన్ని విడకపోవడం విచారకరం.. వివాహం కోసం వరకట్నం డిమాండ్ చేసే యువకుడు తన విద్య, దేశాన్ని కించపరుస్తాడు.. మహిళలను అగౌరవపరుస్తాడు అని మహాత్మా గాంధీ అన్నారు.’ అని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం స్త్రీపక్ష కేరళ పథకం వరకట్నం, సంబంధిత పద్ధతులను వదలివేయాలని చెప్పడం ద్వారా మహిళల గౌరవాన్ని నిర్ధారించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది’ అని అన్నారు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరమని, దీనికి ఐదేళ్ల వరకూ శిక్ష తప్పదని అన్నారు. కేరళను నిజమైన ‘దేవభూమి’గా చేద్దాం.. ఇక్క యువతీ యువకులు వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్‌లో చేరితే.. సులభంగానే రుణం!

Thu Jul 15 , 2021
మీరు పోస్టాఫీస్ స్కీమ్‌లో చేరాలని భావిస్తున్నారా? అయితే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటుంది. ఇందులో చిన్న మొత్తంలోనే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది.