లాక్‌డౌన్ ఎత్తేసి.. ఆ పద్ధతి అమలు చేస్తారా? మంత్రులతో KCR సమీక్ష, కీలక ప్రకటన చేసే ఛాన్స్!

Pragathi Bhavan: తెలంగాణలో జూన్ 19తో లాక్‎డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది.

ప్రధానాంశాలు:ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్మంత్రులతో సమీక్షకీలక ప్రకటన వెలువడే ఛాన్స్తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం దాటాక ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆ వెంటనే కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు భేటీ అయ్యారు. లాక్ డౌన్ సడలింపుతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై కీలకంగా చర్చిస్తున్నారు. కాగా.. తెలంగాణలో జూన్ 19తో లాక్‎డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది.

Telangana Cabinet అత్యవసర భేటీ.. లాక్‌డౌన్ ఎత్తివేత? కొత్తగా వీటికి అనుమతులిచ్చే ఛాన్స్!
తెలంగాణలో ఢిల్లీ తరహా అన్ లాక్?
అయితే, 20 తర్వాత లాక్‎డౌన్ పూర్తిగా ఎత్తేయాలా..? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించాలా..? అనేదానిపై ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చించి శుక్రవారమే కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ తరహా అన్‎లాక్‎కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36 శాతానికి తగ్గిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం అన్‎లాక్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‎లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని విషయాలపై శుక్రవారం రాత్రిలోపు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐఏఎస్‌ల బదిలపై కూడా..
అంతేకాక, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు ఎప్పుడో రంగం సిద్ధమైంది. ఈ మేరకు జాబితా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందని , కేసీఆర్‌ సంతకమే తరువాయి అని ప్రభుత్వ వర్గాల సమాచారం. అదనపు బాధ్యతలు తొలగించి, ఒక్కో అధికారికి ఒకే ఒక్క ప్రధాన శాఖ అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది.

సడెన్‌గా సర్పంచ్‌కు ఫోన్ చేసిన KCR.. సీఎం చెప్పింది విని ఫుల్ ఖుషీ ఆదిలాబాద్‌లో వింత పెళ్లి, ఇదో విచిత్రం.. ఏలాగో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు! TPCC ఎంపిక చివరి దశకు.. సీల్డ్ కవర్‌లో ఆయన పేరే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆన్‌లైన్‌లో కనిపించిన పోకో ఎఫ్3 జీటీ.. లాంచ్ అయితే బెస్ట్ అయ్యే అవకాశం!

Fri Jun 18 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో త్వరలో లాంచ్ చేయనున్న పోకో ఎఫ్3 జీటీ యూఎస్ ఎఫ్‌సీసీ వెబ్ సైట్లో కనిపించింది. గతంలో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.