ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు విలక్షణ నటులు.. పోస్టరే ఇలా ఉందంటే.. సినిమా ఎలా ఉంటుందో..?

వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన ముగ్గురు విలక్షణ నటుడు ఒకే సినిమాలో నటిస్తే.. ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. ఆ సినిమానే ‘విక్రమ్’. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సెన్సేషల్ నటుడు విజయ్ సేతుపతి కలిసి నటిస్తోన్న సినిమా ఇదీ..

ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. నిజానికి కమల్ వెండితెరపై నటుడుగా కనిపించి చాలాకాలం అయింది. చివరిగా ఆయన నటించిన ‘చీకటి రాజ్యం’ అనే సినిమా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం కమల్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు’ సీక్వెల్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఖైదీ’, ‘మాస్టర్’ ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో ఆయన ‘విక్రమ్’ అనే సినిమా చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లు, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్‌నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతపతి. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ ముగ్గురు స్టార్లలతో కలిపి ఓ ఆసక్తికర పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో మధ్యలో కమల్ ఉండగా.. కుడివైపు ఫహద్ ఉన్నారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటుంది. పోస్టరే ఈ రేంజ్‌లో ఉందంటే సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. కొంతకాలం క్రితం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది.. త్వరలో సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మించనున్న 50వ సినిమా ఇది కావడం మరో విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Mahesh Kathi Died: కత్తి మహేష్ మరణంపై అనుమానాలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన అతని మామయ్య

Sat Jul 10 , 2021
కత్తి మహేష్‌కి యాక్సిడెంట్‌లో బలమైన గాయాలు అయినప్పటికీ ఆయనకు చేసిన శస్త్ర చికిత్సలు అన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో మూడు రెండు వారాల్లో ఆయన డిచ్చార్జ్ కాబోతున్నారని ఆయన సన్నిహితులు తెలియజేసిన విషయం తెలిసిందే.