స్మార్ట్‌ఫోన్ వాడే వారికి భారీ షాక్.. వెంటనే ఈ 8 యాప్స్‌ మీ ఫోన్ నుంచి డిలేట్ చేయండి.. లేదంటే..

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు హెచ్చరిక. మీరు వెంటనే కొన్ని యాప్స్‌ను మీ ఫోన్ నుంచి డిలేట్ చేయాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ యాప్స్ ఏంటివో తెలుసుకోండి.

ప్రధానాంశాలు:ఫోన్ వాడే వారికి అలర్ట్కొత్త మాల్వేర్ గుర్తింపుఈ యాప్స్ తొలగించండిమీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. గూగుల్ ప్లేస్టోర్‌లో కొన్ని యాప్స్ వల్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హాని కలిగే అవకాశముంది. మరీముఖ్యంగా పలు యాప్స్‌లో జోకర్ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది.

యాప్స్ ద్వారా జోకర్ మాల్వేర్ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి వినియోగదారుల డేటాను సీక్రెట్‌గా సేకరిస్తోంది. తర్వాత ఈ మాల్వేర్ యూజర్ల డేటాతో అడ్వర్టైజ్‌మెంట్ వెబ్‌సైట్లలోకి వెళ్లి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటోంది. ఈ విషయం ఫోన్ వాడే వారికి అసలు తెలియదు. దీని వల్ల ఫోన్ వాడే వారికి ప్రతికూల ప్రభావం పడుతుంది.

Also Read: SBI ఖాతాదారులకు హెచ్చరిక.. ఆ సేవలపై బ్యాంకు కీలక ప్రకటన.. వివరాలివే..

క్విక్ హీల్ సెక్యూరిటీ తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 8 యాప్స్‌లో ఈ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ గురించి గూగుల్‌కు కూడా తెలియజేశారు. గూగుల్ వెంటనే ఈ యాప్స్‌ను తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఆ 8 యాప్స్ ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Auxiliary Message
2. Fast Magic SMS
3. Free CamScanner
4. Super Message
5. Element Scanner
6. Go Messages
7. Travel Wallpapers
8. Super SMS

మీరు ఈ యాప్స్‌లో ఏమైనా యాప్స్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే.. వెంటనే డిలేట్ చేయండి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆ తిట్లు వింటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది.. ఆలోచిస్తేనే భయంగా.. కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్

Sat Jun 19 , 2021
తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మంత్రి కొడాలి చేసిన కామెంట్స్‌పై కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.