ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. వచ్చే వారమే ప్రీ-బుకింగ్స్!

జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్స్ట్ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ మనదేశంలో వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి.

ప్రధానాంశాలు:ధర రూ.3,499గా ఉండనుందని వార్తలుసెప్టెంబర్ 10వ తేదీ నుంచి సేల్జియోఫోన్ నెక్స్ట్ ప్రీ-బుకింగ్స్ మనదేశంలో వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంలో ఈ ఫోన్ తయారవుతోంది. ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్ ఉండనున్నాయని తెలుస్తోంది.

జియోఫోన్ నెక్స్ట్ ధర(అంచనా)
ఈ ఫోన్ ధర గతంలోనే ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ప్రకారం.. ఈ జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.3,499గా ఉండనుంది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదేనని జియో గతంలోనే ప్రకటించింది.
రెడ్‌మీ నోట్ 10 ధర ఏకంగా ఐదుసార్లు పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
జియోఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం… ఇందులో 5.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1,440 పిక్సెల్స్‌గా ఉండనుంది. ఇందులో క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 64 బిట్ క్వాడ్‌కోర్ మొబైల్ ప్రాసెసర్.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుందని తెలుస్తోంది. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. 4జీ వోల్టే, డ్యూయల్ సిం సపోర్ట్ కూడా ఇందులో ఉండనున్నాయి. తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లు ప్రభావవంతంగా పనిచేయడానికి డ్యుయోగో అనే ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో గూగుల్ కెమెరా గో అనే ఫీచర్ కూడా ఉంది.

ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్పీడీడీఆర్3 ర్యామ్, ఈఎంఎంసీ 4.5 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
మోటొరోలా బడ్జెట్ 5జీ ఫోన్ సేల్ మొదలైంది.. 108MP కెమెరా, ఓఎల్ఈడీ స్క్రీన్ కూడా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

విక్రమాదిత్యుడి సీటులాంటిదే జడ్జి సీటు.. వీడ్కోలు సభలో జస్టిస్ హిమా కోహ్లి వ్యాఖ్యలు

Sat Aug 28 , 2021
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ హిమా కోహ్లికి.. హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.