నిరుద్యోగుల కోసం పవన్ కళ్యాణ్: ఇదే సరైన టైమ్.. జనసైనికులు ఓ రేంజ్‌లో!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదల చేసి జాబ్ కేలెండర్‌పై దుమారం రేగుతోంది. ఈ తరుణంలో జనసైనికులు గళం విప్పుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ కేలెండర్‌పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఏపీపీఎస్సీ గ్రూప్- 1, & గ్రూప్- 2 కింద 36 పోస్టులు, పోలీస్ శాఖలో 450, విద్యాశాఖలో 240 పోస్టులు మాత్రమే ప్రకటించడంతో యువత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు జాబ్ క్యాలెండర్‌ను అస్త్రంగా మలుచుకుంటున్నాయి. తెలుగు దేశం పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపడుతున్నాయి.

జనసేన కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేన కార్యకర్తలు తమ అధినేత పవన్ కళ్యాణ్‌కు కీలక వినతి చేశారు. రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. బయటకు రావాలని జనసేనానిని కోరారు. ఈ మేరకు జనసైనికులు ట్వీట్లు చేస్తున్నారు.

‘‘పవన్ కళ్యాణ్ గారు మీరు బయటకు రావాలి.యువతకు అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగుల కోసం పోరాడాలి. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎలా అయితే పోరాడారో.. రైతుల కోసం దీక్ష ఎలా చేశారో.. అమరావతి రైతుల కోసం ఎలా అయితే పోరాడారో.. ఇప్పుడు నిరుద్యోగుల కోసం పోరాడాలి. మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఉన్నాం.’’ అంటూ ఓ జనసైనికుడు పవన్ కళ్యాణ్‌ను కోరారు. అలాగే జనసైనికులు సోషల్ మీడియా వేదికగా.. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అరటి పండ్లు రూ.3300.. కాఫీ ప్యాకెట్ రూ.7300.. ఆకాశాన్ని తాకిన ధరలు!

Mon Jun 21 , 2021
అరటి పండ్ల ధర రూ.వేలల్లో ఉంది. కాఫీ, టీ ప్యాకెట్ కొందామంటే రూ.5 వేల నుంచి 7 వేలు ఖర్చవుతోంది. ఎక్కడని ఆలోచిస్తున్నారా? ఉత్తర కొరియాలో. ఈ దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఉందని తెలుస్తోంది.