పనస గింజలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందా? ప్రయోజనాలేమిటీ?

రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని ఆహారాలు అంత ఈజీగా తినలేము. అయితే, పనస గింజలు రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పనస పండ్లు, దాని గింజల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూసేయండి మరి.

వైరస్‌లు తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా వైరస్‌లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుకోవల్సిన అవసరం ఉంది. అయితే, నేటి ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి అవసరమైన ఇమ్యునిటీ లభించడం లేదు. పైగా శరీరానికి హానిచేసే కొవ్వులు, విషతుల్యాలు శరీరంలోకి చేరుతున్నాయి. ఫలితంగా వైరస్‌లు దాడిచేసినప్పుడు త్వరగా అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిందే. వేళకు ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం తప్పనిసరి. మరోవైపు శరీరానికి మేలు చేసే ఇమ్యునిటీ ఫుడ్‌ను తీసుకోవడం మంచిది. ఇప్పటివరకు ఇమ్యునిటీని అందించే ఎన్నో ఆహారాల గురించి వినే ఉంటారు. అయితే, పనస పండు గింజలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

మీలో చాలామంది చిన్నప్పుడు పనస పండ్లు తినే ఉంటారు. ఆ పండులో ఉండే గింజలను నిప్పుల్లో ఉండికించి తింటే భలే టేస్టీగా ఉంటుంది. అలాగే పెద్దలు కూడా ఆ గింజలతో పనస పట్టు కూర చేసేవారు. అయితే, ఇన్నాళ్లు మనం అది సాధారణ వంటకం మాత్రమే అని భావించేవాళ్లం. అది అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎవరికీ తెలీదు. ప్రస్తుతం ప్రజలకు రోగనిరోధక శక్తి మీద శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో ఆరోగ్యాన్ని అందించే ఆహారాల గురించి తెలుసుకొనే అవకాశం వస్తోంది.

కొన్ని సీజన్లలో మాత్రమే లభించే పనస పండును మిస్ కాకుండా తీసుకోండి. అయితే, అందులోని గింజలను మాత్రం పాడేయకండి. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్ ఇటీవల పనస పండు గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వివరించారు. పనస పండు గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఇమ్యునిటీతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్టవ్ మీద సన్నని మంటపై కాల్చిన పనస గింజల ఫొటోను షేర్ చేశారు.

‘‘పనస పండు గింజలతో కూర కూడా చేసుకోవచ్చు. వాటిని అన్నంలో కలుపుకుని తినొచ్చు. వాటిని ఉడకబెట్టవచ్చు లేదా పెనంపై వేపి ఉప్పు, కారం, మిర్యాలపొడి చల్లుకుని తినొచ్చు. పనస గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్ కూడా లభిస్తుంది. కణజాలాన్ని సైతం బలోపేతం చేస్తుంది’’ అని తెలిపారు.

‘‘మన శరీరం సహజంగానే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. శరీరంలోకి వైరస్ లేదా బ్యాక్టీరియాలు, ఇతరాత్ర హానికరాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే స్పందిస్తుంది. వాటితో పోరాడి అనారోగ్యాన్ని దరిచేరకుండా కాపాడుతుంది. అయితే, ప్రస్తుతం ఉన్న మన జీవనశైలి వల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతోంది. ఒత్తిడి, చెడు అలవాట్లు, సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల.. సహజ నిరోధక శక్తి దెబ్బతింటోంది’’ అని తెలిపారు.

ఇలా కోల్పోతున్న రోగనిరోధక శక్తిని మళ్లీ సమకూర్చుకోవాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మారిన మన ఆహారపు అలావాట్ల వల్ల గత రెండు దశబ్దాల నుంచి ఇమ్యునిటీని కోల్పోతున్నాం. పాశ్చాత్య దేశాల ఆహారాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మన పూర్వికులు తరతరాలుగా అందిస్తున్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని దూరం చేసుకుంటున్నాం. కాబట్టి.. ఇప్పటికైనా మన సాంప్రదాయ ఆహారాన్ని అలవాటు చేసుకుందాం. పిజ్జా, బర్గర్లను దూరం పెడదాం.

పనస పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
❂ పనస గింజల్లో ఉండే లెక్టిన్లు రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తాయి. అయితే, రోగ నిరోధక శక్తి చికిత్స పొందె రోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
❂ పనస పండుతో గుండెపోటును దూరం చేసుకోవచ్చు.
❂ పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌-C, పనసలో విటమిన్‌-A పుష్కలంగా ఉంటాయి.
❂ పెద్ద ప్రేగు (కోలన్) క్యాన్సర్‌ను దూరం చేసే యాంటీ-యాక్సిడెంట్లు ఈ పండులో ఉన్నాయి.ః
❂ ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది.
❂ అనీమియాను దూరం చేస్తుంది.
❂ పనసలోని విటమిన్-A మెదడు నరాలను బలపరుస్తుంది.
❂ పనసలో ఉండే పొటాషియం మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రిస్తుంది.
❂ పనస అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
❂ పనస కంటి దృష్టిని మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
❂ వీర్యవృద్ధికి పనస పండు సహకరిస్తుంది.‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రేమిస్తున్నా.. కానీ, ఆమెపై నమ్మకం లేదు.. తన ఫ్రెండ్స్‌తో అలా చేస్తోంది’
❂ వాత, పిత్త వ్యాధులు నయమవుతాయి.
❂ పనసలోని ఫైబర్ పైల్స్‌ను నివారిస్తుంది.
❂ పనస లేత తొనల్ని వేయించి తీసుకుంటే పిత్తం తొలగిపోతుంది.
❂ పనస పండులో ఉండే ఐరన్ రక్తహీనత నివారిస్తుంది.
❂ పచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్‌కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే.. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
❂ పనస పండులో ఉండే సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ ఉంటాయి. మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోందా? ఈ టిప్స్‌‌ పాటించండి
❂ పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
❂ ఏదైనా సరే మితంగా తినాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా ఈ పండును తింటే కొత్త సమస్యలు వస్తాయి.
❂ పనస పండు వల్ల సుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయనే ఉద్దేశంతో ఔషదాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే న్యూట్రీషియన్లు లేదా వైద్యుల సూచన తీసుకోండి.
❂ పనస పండు నుంచి వచ్చే రబ్బరు పాలు వల్ల అలర్జీకి గురయ్యే అవకాశం ఉంది.
❂ రక్త సమస్యలు ఉన్నవారు పనస పండ్లను తీసుకోకపోవడమే ఉత్తమం.
❂ శస్త్ర చికిత్స పొందినవాళ్లు, అధికంగా ఔషదాలు తీసుకొనేవాళ్లు పనస పండ్లను తక్కువగా తీసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించండి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎలాంటి బాధ్యత వహించదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Vidya Balan : తొలి సంపాదన అదే.. రెమ్యూనరేషన్‌పై విద్యాబాలన్ కామెంట్

Thu Jun 17 , 2021
ఎంతటి వారైనా సరే వారి మొదటి సంపాదన ఎప్పటికీ ప్రత్యేకమే. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తున్నా సరే ప్రారంభంలో అర్జించిన వంద రూపాయలు కూడా ఎంతో గొప్పే. అందుకే అందరూ కూడా తమ తొలి సంపాదన గురించి ఎంతో గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు.