ముఖంపై రంధ్రాలు తగ్గాలంటే ఇలా చేయండి..

సాధారణంగా కోడి గుడ్లలో ఉండే తెల్ల సొనని అందానికి ఉపయోగిస్తూ ఉంటాము. నిజంగా కోడి గుడ్లని అద్భుతమైన ఆహార పదార్థం అని చెప్పవచ్చు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు ఇది అందానికి కూడా ఎంతగానో సహాయ పడుతుంది.

ప్రధానాంశాలు:అందానికి మేలు చేసే గుడ్డుగుడ్లు వాడడం వల్ల ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్నిజంగా కోడి గుడ్లలో ఉండే తెల్లసొన వల్ల అందానికి ప్రయోజనం కలుగుతుందా…? వాటిని ఉపయోగించడం వల్ల మేలైన నిగారింపు సొంతం చేసుకోవచ్చా…? దానిని ఉపయోగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది…? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు ఈ షాంపూ వాడాలట..
మనం అందంగా కనపడాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లక్కర్లేదు, అలాగని ఎక్కడెక్కడి నుంచో ఫేస్ ప్యాక్ లు తెచ్చి వేసుకోనక్కర్లేదు. కేవలం మన ఇంట్లో ఉండే వంటింట్లోకి వెళ్లి అనేక రకాల సమస్యలు ఇట్టే పరిష్కరించుకోవచ్చు. మన వంటింట్లో ఉండే సామాన్లు నిజంగా బాగా పని చేస్తాయి. దీని కోసం పెద్దగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలిసిందే.
మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆపరేషన్ మంచిదట..
శెనగపిండి, పసుపు ఇలా ఎన్నో వాటిని మనం నిత్యం అందానికి ఉపయోగిస్తూనే ఉంటాము. వీటి వల్ల మేలైన నిగారింపు సొంతమౌతుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా కోడి గుడ్లలో వుండే తెల్ల సొన వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మరింత అందంగా మీరు కనిపించవచ్చు. దీనిలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఒక మాయ చేస్తాయి. అందానికి బాగా ఉపయోగపడతాయి. వీటితో ఒక్కసారి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇలా కనుక మీరు ప్రయత్నిస్తే మీరు ప్రతిసారీ ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నిజంగా చాలా మంచి పద్ధతి.

గుడ్లలో న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజు డైట్ లో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా తెల్లసొన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు అందంగా కనిపించాలంటే దీన్ని ఉపయోగించాలి. కొన్ని దశాబ్దాల నుంచి ఇవి అందానికి మరియు జుట్టు సంరక్షణకు కూడా బాగా ఉపయోగ పడుతుంది. పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు చిటికలో మాయం చేస్తాయి. కేశ సంరక్షణలో కూడా ఇది బాగా పని చేస్తుంది.

యాంటీ ఏజింగ్:

తెల్ల సొన యాంటీ ఏజింగ్‌గా పని చేస్తుంది. అయితే మీరు దీని కోసం చేయాల్సిందల్లా… ముందుగా మీరు ఒక స్పూన్ తెల్ల సొనని తీసుకోండి. ఇప్పుడు దీనిలో రెండు నుంచి మూడు డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోండి. ఈ రెండు బాగా కలిపి మీరు మీ ముఖం పై దీనిని అప్లై చేయండి. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుంది అంటే..? మీ చర్మం దగ్గర పడుతుంది. అలానే చర్మం పై ఉండే ముడతలను తగ్గిస్తుంది. ఇది చాలా బాగా పని చేస్తుంది. నమ్మట్లేదా….? అయితే మీరే తయారు చేసుకుని ఈ విధంగా ఫాలో అవ్వండి మార్పు మీకే కనిపిస్తుంది.

ఇది ఒకటి మాత్రమే కాదు మరొక పద్ధతి కూడా ఉంది. అయితే మరి దాన్ని కూడా చూసేద్దామా..? మీరు ఒక టేబుల్ స్పూన్ తెల్ల సొనని తీసుకోండి. దీనిలో ఒక అర టేబుల్ స్పూన్ తేనె కలపండి. బాగా కలిపిన తరువాత ఈ మిశ్రమాన్ని ముఖం పై అప్లై చేయండి. చర్మం పై బాగా పని చేస్తుంది. మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ప్రతి రెండు వారాలకు ఒకసారి దీనిని మీరు రిపీట్ చేస్తే చర్మం పై ముడతలు తగ్గుతాయి. పైగా ఇది చాలా సులువైన పద్ధతి కూడా.

ముడతలను తగ్గించుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కష్టమైన పద్ధతుల్ని అనుసరించడం కంటే ఈజీ విధానాన్ని పాటించడం మేలు చేస్తుంది. అలానే ముడతలు కూడా సులువుగా తగ్గిపోతాయి. అందుకోసం మీరు మర్చిపోకుండా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. సులువుగా ముడతలని తొలగించుకోవచ్చు పైగా మరింత అందంగా కూడా ఉంటారు.

ముఖంపై రంధ్రాలకి:

మీకు మొహం పై రంద్రాలు ఉన్నాయా…? వాటి నుంచి బయట పడడానికి ఎంత ప్రయత్నం చేస్తున్న కుదరడం లేదా…? అయితే తప్పకుండా మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎంతో సులువుగా ముఖంపై ఉన్న రంధ్రాలని పోగొట్టుకోవచ్చు. భయపడకండి ఇది కష్టమైన పద్ధతి కాదు. ఎంతో సులువుగా వాటి నుండి బయట పడవచ్చు. దీంతో మీ స్కిన్ అంత క్లియర్‌గా ఉంటుంది.

దీని కోసం మీరు ముందుగా ఒక స్పూన్ తెల్లసొనని తీసుకోండి. అంతే కాదు దీనితో పాటు ఒక టేబుల్ స్పూన్ పంచదారని మరియు ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపి మీ ముఖంపై పట్టించండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ముఖం పై ఏర్పడిన బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి మరియు ముఖం పై ఏర్పడిన రంధ్రాలు కూడా తొలగిపోతాయి. మొక్కజొన్న పిండిని ఈ మిశ్రమంలో కలపడం వల్ల మురికి మీ ముఖం నుండి తొలగిపోతుంది. దీనితో మీ చర్మం అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. ఈ పద్ధతిని కూడా మీరు తరచూ రిపీట్ చేయండి
ఈ మూలికలు తింటే ప్రెగ్నెన్సీ వస్తుందట..
రెండు వారాలకి ఒకసారి ఇలా చేస్తే మురికి పోవడం, రంధ్రాలు పూడుకుపోవడం జరుగుతాయి. అదే విధంగా జిడ్డు చర్మంతో బాధపడే వాళ్ళ కోసం కూడా ఒక పద్ధతి ఉంది. అలా ఫాలో అయితే జిడ్డు చర్మం వాళ్ళకి కాస్త ఉపశమనం లభిస్తుంది. జిడ్డు చర్మం కలవాళ్ళు ఒక స్పూన్ తెల్ల సొనని తీసుకొని అర టీ స్పూన్ నిమ్మ రసం మరియు ఒక స్పూన్ తేనే వేసుకుని బాగా కలపాలి. ఇలా ఈ మూడింటిని కలిపి సిద్ధం చేసుకుని ముఖంపై అప్లై చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని కనుక మీరు మీ ముఖం పై అప్లై చేస్తే జిడ్డు చర్మం నుండి ఉపసమనం లభిస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ముద్దుపెట్టే మూడ్ మొత్తం పోయినట్టుంది.. జెనీలియా-రితేష్ రొమాన్స్‌కు అలా బ్రేక్!

Thu Jul 8 , 2021
బాలీవుడ్ క్యూట్ కపుల్ జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్‌లు సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ కపుల్‌గా నెటిజన్లు వీరు చేసే అల్లరిని ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ ఇద్దరూ రీల్ వీడియోలతో తమ ఫాలోవర్లను ఆకట్టుకుంటారు.