పెను విషాదం.. కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 82 మంది మృతి

hagdad Covid hospital Fire కరోనా బారినపడి ప్రాణాల కోసం ఆస్పత్రికి వస్తే అవి మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఆస్పత్రుల నిర్లక్ష్యంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రధానాంశాలు:కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.ఊపిరాడక ప్రాణాలొదిలిన బాధితులు.ఆక్సిజన్ సిలిండర్ల పేలడంతో ఘటన.కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుని వందల మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. తాజాగా, ఇరాక్‌లోని కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి కనీసం 82 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌లోని ఇబన్ అల్ ఖతీబ్ హాస్పిటల్ ఐసీయూలో ఆదివారం తెల్లవారుజామున ఆక్సిజన్‌ సిలిండర్లు పేలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో 120 మంది రోగులు ఉండగా.. దాదాపు 90 మందిని భద్రతా సిబ్బంది రక్షించినట్టు ఇరాక్ అధికారిక మీడియా వెల్లడించింది.

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే 23 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించగా.. ప్రస్తుతం మృతుల సంఖ్య 82కి పెరిగింది. ఆక్సిజన్ సిలిండర్ల పేలిపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఆస్పత్రిలో ఎటువంటి ఫైర్ సేఫ్టీ వ్యవస్థ కూడా లేదని స్థానిక మీడియా పేర్కొంది. తొలుత ఐసీయూలో చెలరేగిన మంటలు తర్వాత అన్ని అంతస్తులకు వ్యాపించాయని వైద్య వర్గాలు తెలిపాయి. బాధితుల్లో ఎక్కువ మంది వెంటలేటర్లపై ఉండటంతో వాటి తొలగించి బయటకు తరలించేలోపు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు పొగతో ఊపిరాడక చనిపోయారు.

అయితే, ఈ ప్రమాదానికి నిర్లక్ష్యంతో పాటు మహమ్మారి సమయంలో అవినీతే కారణమని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక, ఇరాక్ ఆస్పత్రులను దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. కనీస సౌకర్యాలకు అక్కడ ప్రభుత్వం నిధులు వెచ్చించడం లేదు. ఔషధాలు, బెడ్స్ కొరతతో తీవ్రంగా ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆరోగ్య శాఖకు బాగ్దాద్ గవర్నర్ మొహమూద్ జబేర్ సూచించారు. ఘటనకు దారితీసిన కారణాలు, విధుల్లో అలసత్వం చూపినవారి గుర్తించి శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

‘‘కోవిడ్ -19 బాధితుల జీవితాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆస్పత్రులు మంటలకు అర్పణం చేసి తీవ్ర నేరానికి పాల్పడ్డారు’’ అని ఇరాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోగ్య మంత్రి హసన్ అల్ తమీమీపై ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధేమీ చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పిలుపునిచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఇరాక్ ప్రధాని.. తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆక్సిజన్ కొరతపై నవంబరులోనే పార్లమెంటరీ కమిటీ హెచ్చరిక.. నివేదికలో సంచలన విషయాలు

Sun Apr 25 , 2021
Oxygen Crisis దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి ఆస్పత్రుల్లో బెడ్స్ నిండిపోగా.. ఆక్సిజన్ అందక పదుల కొద్దీ మరణాలు చోటుచేసుకోవడం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది.