ఐకూ 7 సిరీస్ వచ్చేసింది.. ఎంఐ 11ఎక్స్, వన్ ప్లస్‌ 9 సిరీస్‌కు సరైన పోటీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. అవే ఐకూ 7, ఐకూ 7 లెజెండ్ ఎడిషన్. వీటి ధర రూ.31,990 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రధానాంశాలు:ధర రూ.31,990 నుంచి ప్రారంభంఅమెజాన్‌లో సేల్ఐకూ 7 సిరీస్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం మార్చిలో చైనాలో లాంచ్ అయిన ఐకూ నియో 5కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఐకూ 7 లాంచ్ కాగా, బీఎండబ్ల్యూ ఎం మోటర్ స్పోర్ట్ రేసింగ్ భాగస్వామ్యంతో ఐకూ 7 లెజెండ్ లాంచ్ అయింది. వీటిలో వెనకవైపు మూడు కెమెరాలు, 120 హెర్ట్జ్ డిస్ ప్లేలు ఉండనున్నాయి. వీటిలో 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఐకూ 7 ఎంఐ 11ఎక్స్‌తోనూ, ఐకూ 7 లెజెండ్ ఎంఐ 11ఎక్స్ ప్రో, వన్ ప్లస్ 9ఆర్‌తోనూ పోటీ పడనున్నాయి.

ఐకూ 7 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.31,990గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,990గానూ నిర్ణయించారు. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,990గా ఉంది. స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఐకూ 7 లెజెండ్ స్పెసిఫికేషన్లు
ఇందులో రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,990గా నిర్ణయించారు. సింగిల్ లెజండరీ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్లు
వీటిపై లాంచ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐకూ 7ను ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపును అందించనున్నారు. దీంతోపాటు రూ.2,000 అమెజాన్ డిస్కౌంట్ కూపన్ కూడా లభించనుంది. ఐకూ 7 లెజెండ్ ఎడిషన్‌ను ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 తగ్గింపు లభించనుంది. రూ.2,000 అమెజాన్ డిస్కౌంట్ కూపన్ కూడా అందించనున్నారు.
24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్.. స్నాప్‌చాట్ తరహా ఫీచర్ వాట్సాప్‌లో?
ఐకూ 7 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గా ఉంది. యాస్పెక్ట్ రేషియో 20:9 శాతంగా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను ఇందులో అందించారు. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.

ఐకూ 7 లెజెండ్ స్పెసిఫికేషన్లు
ఇందులో కూడా 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉండగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టును ఇందులో అందించనున్నారు. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 209.5 గ్రాములుగా ఉంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లే మొదటి సేల్ నేడే.. రూ.9 వేలలోపే సూపర్ ఫీచర్లు!
iQOO 7 స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్Qualcomm Snapdragon 888 5Gడిస్_ప్లే6.62 inches (16.81 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా48 MP + 13 MP + 13 MPబ్యాటరీ4000 mAhprice_in_india31990ర్యామ్8 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిఇతర వేరియంట్లు iQOO 7 iQOO 7 256GB 12GB RAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అలా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..

Mon Apr 26 , 2021
వెండితెరపై తన అందచందాలతో ప్రేక్షకులను అలరించిన బ్యూటీ నిక్కీ తంబోలి కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో కరోనా బారిన పడిన ఈ బ్యూటీ.. ఈ మధ్యే పూర్తిస్థాయిలో కోలుకుంది. ఇప్పుడు కరోనాతో బాధపడుతూ.. వైద్య ఖర్చులు భరించలేని వారికి తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చింది.