అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 12.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్!

యాపిల్ ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపును అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న స్మార్ట్ ఫోన్స్ కార్నివాల్ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.12,901 తగ్గింపు లభించింది.

ప్రధానాంశాలు:ఐఫోన్ 12పై రూ.12,901 తగ్గింపుఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ కార్నివాల్ సేల్ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్‌లో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఐఫోన్ 12లో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో కూడా 5జీ సపోర్ట్‌ను కంపెనీ అందించింది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.

ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.66,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 కాగా ఇప్పుడు ఈ ఫోన్ రూ.12,901 వేల తగ్గింపుతో లభించనుందన్న మాట. గతంలో జరిగిన సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.9 వేల డిస్కౌంట్‌ను అందించగా, ఇప్పుడు ఏకంగా రూ.13 వేల వరకు తగ్గింపును అందించారు.
ఈ ఫోన్‌కి అప్పుడే ఆండ్రాయిడ్ 12 కూడా.. అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు!
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల డిస్ ప్లేను యాపిల్ అందించింది. ఏ14 బయోనిక్ చిప్‌పైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. 5జీ సపోర్ట్ కూడా ఇందులో కంపెనీ అందించనుంది. 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలోనే ఈ ఫోన్ కూడా కొనుగోలు చేయవచ్చు. 17 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను ఈ ఫోన్ అందిస్తుంది. దీని మందం కేవలం 0.74 సెంటీమీటర్లు మాత్రమే ఉండగా, బరువు 164 గ్రాములుగా ఉంది.

ఐవోఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.ఇందులో కూడా వెనకవైపు 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలనే అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం కూడా 12 మెగా పిక్సెల్ గానే ఉంది. ఈ ఫోన్‌తో పాటు చార్జర్ రాదు. కేవలం లైటెనింగ్ కేబుల్ మాత్రమే రానుంది. అడాప్టర్ కావాలంటే ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ కూడా ఈ నెలలోనే జరగనుంది కాబట్టి ఐఫోన్ 12 సిరీస్ ధరలు త్వరలో మరింత తగ్గే అవకాశం ఉంది.
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు.. ఎంత తగ్గింది? ఏ ఫోన్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పారాలింపిక్స్‌లో భారత్‌కి రజత పతకం.. 18 ఏళ్ల ప్రవీణ్ సంచలనం

Fri Sep 3 , 2021
పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 11కి చేరింది. హై జంప్‌లో 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ శుక్రవారం రజత పతకాన్ని భారత్‌కి అందించాడు. పారా ఒలింపిక్స్‌లో ప్రవీణ్ పోటీపడటం ఇదే తొలిసారి.