ప్రభుత్వ అబద్దాలను బయటపెట్టడం మేధావుల బాధ్యత.. సుప్రీంకోర్టు జడ్జ్ సంచలన వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించి, తప్పుడు కథనాలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

ప్రధానాంశాలు:డేటా కోసం ప్రభుత్వాలపై ఆధారపడొద్దని సూచన.మేధావి వర్గం బాధ్యతను గుర్తించేసిన న్యాయమూర్తి.నకిలీ వార్తల ప్రచారం పెరుగుతోందని ఆందోళన.ప్రభుత్వం లోపాలను, అబద్దాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత మేధావులకు ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం జరిగిన జస్టిస్ ఎంసీ చాగ్లా స్మారకోపన్యాసంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘స్పీకింగ్ ట్రూత్ టు పవర్.. సిటిజన్ అండ్ ది లా’ అనే అంశంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం, అబద్ధాలు, తప్పుడు కథనాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని జస్టిస్ చంద్రచూడ్ నొక్కిచెప్పారు.

ప్రస్తుత సందర్భంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, వైద్య సత్యాలను అందజేయడానికి ప్రభుత్వంపై అతిగా ఆధారపడకూడదని ఆయన హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణ కోవిడ్-19 డేటా తారుమారేనని వ్యాఖ్యానించారు. ‘నిజం కోసం కేవలం ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడలేరు.. నిరంకుశ ప్రభుత్వాలు అధికారాన్ని ఏకీకృతం చేయడానికి అబద్ధాలపై నిరంతరం ఆధారపడుతుంటాయి.. పలు దేశాలలో కోవిడ్-19 డేటాను తారుమారు చేసే ధోరణి పెరుగుతున్న వాస్తవం మనం చూస్తున్నాం’ అన్నారు.

నకిలీ వార్తల ప్రచారం పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గుర్తించింది … సంచలన వార్తలకు ఆకర్షితులయ్యే ధోరణిని కలిగి ఉండటాన్ని ‘ఇన్ఫోడెమిక్’‌గా పిలుస్తారు… అవి తరచుగా అసత్యాలపై ఆధారపడి ఉంటాయి’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘పోస్ట్-ట్రూత్’ ప్రపంచం గురించి కూడా జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. ఇందులో ‘మా సత్యం 'vs' మీ నిజం మధ్య పోటీ ఉంది.. అంటే అవగాహనకు అనుగుణంగా లేని సత్యాన్ని విస్మరించే ధోరణి’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

Sat Aug 28 , 2021
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.