ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు.. ఎంత తగ్గింది? ఏ ఫోన్?

ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ రూ.500 తగ్గింపును అందించింది. దీంతో ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.9,499 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ప్రధానాంశాలు:ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్‌పై రూ.500 తగ్గింపుఫ్లిప్‌‌కార్ట్‌లో అందుబాటులో..ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో హాట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.500 తగ్గింపును అందించారు. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. మీడియాటెక్ హీలియో జీ85, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999 నుంచి రూ.9,499కు తగ్గింది. ఇక 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 నుంచి రూ.10,499కు తగ్గించారు. మొరాండీ పర్పుల్, 7 డిగ్రీ పర్పుల్, హార్ట్ ఆఫ్ ఓషన్, 95 డిగ్రీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
జియో స్మార్ట్ ఫోన్ ధర లీక్.. సేల్ వచ్చేవారమే!
ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.82 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది. యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్,64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్, పొర్‌ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, హెచ్‌డీఆర్, పొర్‌ట్రెయిట్ హెచ్‌డీఆర్ వంటి ఫీచర్లు ఈ కెమెరాలో అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

వైఫై, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం, మైక్రో యూఎస్‌బీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.92 సెంటీమీటర్లు కాగా, బరువు 211 గ్రాములుగా ఉంది.
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఫోన్.. లాంచ్ రేపే!
ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 10ఎస్‌ స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek Helio G85డిస్_ప్లే6.82 inches (17.32 cm)స్టోరేజ్_ఫైల్64 GBకెమెరాా48 MP + 2 MP + AI Lens Cameraబ్యాటరీ6000 mAhprice_in_india9999ర్యామ్4 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిఇతర వేరియంట్లు ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 10ఎస్‌ Infinix Hot 10s 64GB 6GB RAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నేటి అమెజాన్ క్విజ్ సమాధానాలు ఇవే.. ఎంత గెలవచ్చంటే?

Fri Sep 3 , 2021
అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 3వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.ఐదు వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.