పోస్టాఫీస్ కస్టమర్లకు భారీ షాక్.. ఆగస్ట్ 1 నుంచి..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్. కస్టమర్లు ఇకపై డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందాలని భావిస్తే.. చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి చార్జీలు లేవు.

ప్రధానాంశాలు:పోస్టల్ కస్టమర్లకు షాక్కొత్త రూల్స్ఆగస్ట్ 1 నుంచి అమలులోకిమీకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ ఖాతాదారులకు కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఆగస్ట్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీంతో చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

ఐపీపీబీ కస్టమర్లు ఆగస్ట్ 1 నుంచి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి చార్జీలు లేవు. అయితే ఒకటో తేదీ నుంచి మాత్రం చార్జీలు కట్టాలి. రూ.20 చెల్లించుకోవాలి.

Also Read: ఆధార్ కార్డు ఉన్న వారికి హెచ్చరిక.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు!

అంతేకాకుండా ఐపీపీబీ కస్టమర్లకు మరో షాక్ కూడా ఇచ్చింది. ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా కలిగిన వారికి గతంలో 2.75 శాతం వడ్డీ వచ్చేది. కానీ ఇప్పుడు 2.5 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. అంటే వడ్డీ రేట్లును తగ్గించింది.

ఇకపోతే పోస్టాఫీస్‌ ఖాతాదారులు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులను, ఇతర ఆర్థిక సేవలను ఇప్పుడు ఐపీపీబీ యాప్ ద్వారానే పొందొచ్చు. పోస్టాఫీస్ బ్రాంచుకు వెళ్లా్ల్సిన పని లేదు. మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Andhra Pradesh: రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ల బదిలీ

Wed Jul 14 , 2021
ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయా ప్రవీణ్‌ బదిలీ అయ్యారు.