WTC Finalలో కివీస్‌కి ఫీల్డ్ అంపైర్ సాయం.. కోహ్లీలో టెన్షన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కోసం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సాహసోపేతంగా డీఆర్‌ఎస్ కోరబోయాడు. కానీ.. అతను రివ్యూ అడగక ముందే ఫీల్డ్ అంపైర్…

ప్రధానాంశాలు:విరాట్ కోహ్లీ వికెట్ కోసం రివ్యూ కోరేందుకు సిద్ధమైన కేన్ విలియమ్సన్ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్న ఫీల్డ్ అంపైర్రిప్లైలో కోహ్లీ నాటౌట్ అని తేలిన వైనం.. కివీస్‌కి రివ్యూ సేఫ్ అంపైర్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుభారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఫీల్డ్ అంపైర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తటస్థ అంపైర్లు ఈ మ్యాచ్‌కి పనిచేస్తుండగా.. ఇంగ్లాండ్‌కి చెందిన రిచర్డ్ లింగ్‌వర్త్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కి సాయపడ్డాడు. అదీ విరాట్ కోహ్లీ వికెట్ విషయంలో.. దాంతో.. నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన న్యూజిలాండ్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. బంతిని లెగ్ స్టంప్‌కి కాస్త దూరంగా విసిరాడు. దాంతో.. ఫైన్ లెగ్ దిశగా బంతిని ప్లిక్ చేసేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్: 124 బంతుల్లో 1×4)ప్రయత్నించాడు. అయితే.. బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ చేతుల్లోకి వెళ్లింది.

బంతి బ్యాట్‌కి అత్యంత సమీపంలో వెళ్లడంతో క్యాచ్ ఔట్ కోసం న్యూజిలాండ్ టీమ్ అప్పీల్ చేసింది. అయితే.. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ మౌనంగా ఉండిపోయాడు. దాంతో.. బౌలర్ బౌల్ట్, కీపర్ వాట్లింగ్‌తో చర్చించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరేందుకు సిద్ధమయ్యాడు. కానీ.. విలియమ్సన్ రివ్యూ కోరకముందే అనూహ్యంగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ .. తుది నిర్ణయం కోసం టీవీ అంపైర్‌ని ఆశ్రయించాడు. సాంకేతిక లోపం కారణంగా తాను క్లియర్‌గా సౌండ్ వినలేకపోయానని టీవీ అంపైర్‌తో అతను చెప్పుకొచ్చాడు. అంపైర్ తీరుపై విరాట్ కోహ్లీ ఫస్ట్ అసహనం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ రివ్యూ కోరకుండానే సమీక్ష ఎందుకు..? అని అంపైర్‌ని కోహ్లీ ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది.

మరోవైపు రిచర్డ్ లింగ్‌వర్త్ చర్యతో కేన్ విలియమ్సన్ సెలైంట్ అయిపోయాడు. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి బ్యాట్‌కి దూరంగా వెళ్తున్నట్లు తేల్చి నాటౌట్‌గా ప్రకటించాడు. ఒకవేళ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరి ఉంటే..? అప్పుడు న్యూజిలాండ్‌కి రివ్యూ ఛాన్స్ చేజారేది. అంతకముందే ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్‌ఎస్‌కి వెళ్లిన కివీస్ ఒక రివ్యూ అవకాశాన్ని చేజార్చుకుంది. అయినప్పటికీ.. కోహ్లీ వికెట్ కావడంతో మరోసారి రిస్క్ తీసుకునేందుకు సిద్ధమైంది. కానీ.. ఫీల్డ్ అంపైర్ సేవ్ చేశాడు. ఆ సమీక్ష సమయంలో కాస్త టెన్షన్‌తో కనిపించిన కోహ్లీ.. రిప్లై తర్వాత రిలాక్స్ అయిపోయాడు.

క్రికెట్ నిబంధనల ప్రకారం ఫీల్డర్ క్యాచ్ పట్టిన తీరుపై స్పష్టత కోసం టీవీ అంపైర్‌ని ఫీల్డ్ అంపైర్‌ ఆశ్రయించవచ్చు. కానీ.. బంతి బ్యాట్‌కి తాకిందా లేదా అనే విషయంపై రివ్యూ కోరడమే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంపైర్ నిబంధనల్ని ఉల్లఘించి కివీస్‌కి లబ్ది చేకూర్చాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అంపైర్ తన నిర్ణయం ప్రకటించలేదు. న్యూజిలాండ్ డీఆర్‌ఎస్ కోరలేదు. అయినప్పటికీ.. ఆటోమేటిక్‌గా రివ్యూ’ అని సెహ్వాగ్ చురకలు అంటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

YS Jagan కు కేసీఆర్ సర్కార్ ఝలక్.. TS కేబినెట్‌ సంచలన నిర్ణయం

Sat Jun 19 , 2021
Krishna River Projects: ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్‌కు తెలిపింది.