భారత్ జట్టుకి జరిమానా.. చేసిన తప్పిదం ఏంటంటే..?

ఇంగ్లాండ్‌తో రెండో టీ20 ఉత్కంఠగా ముగిసింది. దాంతో.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డింగ్ కూర్పు కోసం ఎక్కువగా చర్చలు జరుపుతూ కనిపించింది.

ప్రధానాంశాలు:ఇంగ్లాండ్‌పై రెండో టీ20లో పోరాడి గెలిచిన భారత్ మహిళల జట్టుమూడు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంసెకండ్ టీ20లో స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద భారత జట్టుకి జరిమానాఆఖరి టీ20 మ్యాచ్‌ బుధవారంఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ ఆడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టుకి జరిమానా పడింది. కంట్రీ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో ఆదివారం ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో గొప్ప పోరాట పటిమని కనబర్చిన భారత్ జట్టు 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దాంతో.. మూడు టీ20ల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం జరగనుంది. కానీ.. సెకండ్ టీ20లో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి భారత్ జట్టుకి జరిమానా పడింది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ (48: 38 బంతుల్లో 8×4, 1×6) విలువైన పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ టీమ్ 14వ ఓవర్‌కి 105/2తో అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. పుంజుకున్న భారత్ బౌలర్లు చివరికి ఇంగ్లాండ్ టీమ్‌ని 140/8కే పరిమితం చేశారు.

కానీ.. మ్యాచ్‌లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే భారత్ జట్టు ఒక ఓవర్ తక్కువగా వేసింది. దాంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద భారత్ జట్టుకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా పడింది. మ్యాచ్ చివర్లో ఉత్కంఠగా మారడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. బౌలింగ్ మార్పులపై చర్చలతో పాటు ఫీల్డింగ్ కూర్పుల కోసం ఎక్కువ సమయం కేటాయించింది. దాంతో.. మ్యాచ్ సమయం వేస్ట్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు

Tue Jul 13 , 2021
వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.