ఇంగ్లాండ్‌లో పంత్, సాహా ఐసోలేషన్‌లో.. ఇప్పుడు వికెట్ కీపర్ ఎవరు..?

ఇంగ్లాండ్ టూర్‌కి వికెట్ కీపర్లుగా ఎంపికైన రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు భారత్ జట్టు ఈ నెల 20 నుంచి మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లు…

ప్రధానాంశాలు:భారత జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్లు ఐసోలేషన్‌లోకౌంటీ ఎలెవన్‌తో ఈ నెల 20 నుంచి భారత్ మ్యాచ్‌లుఈ మ్యాచ్‌లకి కీపర్‌గా ఎవరు..? టీమిండియా తర్జనభర్జనలుతాను రెడీ అని హింట్ ఇచ్చిన సీనియర్ వికెట్ కీపర్ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌కి ప్రాక్టీస్ కోసం కౌంటీ ఎలెవన్‌తో ఈ నెల 20 నుంచి భారత్ జట్టు మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది.

కానీ.. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి వారం క్రితం డెల్లా వేరియంట్ సోకగా.. టీమిండియాలో త్రోలు విసిరే స్పెషలిస్ట్ దయానంద్ గారానీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. గారానీతో కలిసి టీమిండియా బస చేసిన హోటల్‌లో క్లోజ్‌గా ఉన్న రిజర్వ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, రిజర్వ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వర్‌ని కూడా ఐసోలేషన్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంచిది.

ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన ఇద్దరు వికెట్ కీపర్లు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండటంతో.. వార్మప్ మ్యాచ్‌లకి కీపింగ్ చేసేది ఎవరు..? అనే ప్రశ్న ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌లో కంగారు పెంచుతోంది. టీమ్‌లో కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నా.. టెస్టుల్లో అతనికి కీపింగ్ చేసిన అనుభవం పెద్దగా లేదు. మరీ ముఖ్యంగా.. అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను టెస్టుల్లో కీపింగ్ చేయడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పుడు భారత్ జట్టుకి వికెట్ కీపర్ అవసరమని తెలియగానే.. అక్కడే కామెంటేటర్‌గా పనిచేస్తున్న సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తెరపైకి వచ్చాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన దినేశ్ కార్తీక్.. ప్రస్తుతం కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దాంతో.. కీపింగ్ చేసేందుకు తాను సిద్దమంటూ దినేశ్ కార్తీక్ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడు. మరి టీమిండియా మేనేజ్‌మెంట్ స్పందన ఏంటో చూడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SBI కస్టమర్లకు హెచ్చరిక.. ఈరోజు, రేపు..

Fri Jul 16 , 2021
మీరు ఎస్‌బీఐ కస్టమర్లా? మీకు బ్యాంక్‌లో ఖాతా ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈరోజు, రేపు బ్యాంక్ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగనుంది. ట్విట్టర్ వేదికగా బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది.