అరటి పండ్లు రూ.3300.. కాఫీ ప్యాకెట్ రూ.7300.. ఆకాశాన్ని తాకిన ధరలు!

అరటి పండ్ల ధర రూ.వేలల్లో ఉంది. కాఫీ, టీ ప్యాకెట్ కొందామంటే రూ.5 వేల నుంచి 7 వేలు ఖర్చవుతోంది. ఎక్కడని ఆలోచిస్తున్నారా? ఉత్తర కొరియాలో. ఈ దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఉందని తెలుస్తోంది.

ప్రధానాంశాలు:అరటి పండ్ల ధర రూ.వేలల్లోకాఫీ ప్యాకెట్ రూ.7 వేలుభారీగా పెరిగిన ధరలుమన ఊరిలో డజను అరటి పండ్లు ఎంతకు వస్తాయి? రూ.50 లేదా రూ.60 పెడితే అరటి పండ్లు కొనొచ్చు. సీజన్ ప్రాతిపదికన రేటు అటుఇటుగా ఉండొచ్చు. అయితే డజను అరటి పండ్లకు రూ.వేలల్లో మాత్రం ఇవ్వం. కానీ ఇక్కడ మాత్రం రూ.వేలు పెడితే కానీ అరటి పండ్లు రావడం లేదు.

ఎక్కడ? అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. మన దేశంలో మాత్రం కాదు. ఉత్తర కొరియాలో. అవును మీరు చదివింది నిజమే. ఉత్తర కొరియాలో ఆహారం దొరకడం లేదు. అందుకే అక్కడ ధరలు భారీగా పెరిగిపోయాయి. పలు మీడియా నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

Also Read: కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. రూ.9 వేల భారీ తగ్గింపు!

గత ఏడాది వరదల కారణంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని ఆ దేశ డిక్టేటర్ కిమ్ జంగ్ ఉన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా కూడా ఆహార లభ్యతపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. కోవిడ్ 19 వల్ల ఉత్తర కొరియా సరిహద్దులను మూసేసిన విషయం తెలిసిందే.

దీంతో పొరుగు దేశాల నుంచి ఉత్తర కొరియాలోకి దిగుమతులు తగ్గాయి. చైనాతో వ్యాపార సంబంధాలు తగ్గిపోయాయి. ఉత్తర కొరియా ఫుడ్, ఫ్యూయెల్ కోసం ఎక్కువగా చైనా మీదనే ఆధారపడుతుంది. ఈ క్రమంలో ఉత్తర కొరియాలో కేజీ అరటి పండ్ల ధర రూ.3,300గా ఉంది. కాఫీ ప్యాకెట్ కొనాలంటే రూ.7300 ఖర్చు చేయాలి. బ్లాక్ టీ ప్యాకెట్ ధర రూ.5200గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రచ్చ.. తక్కువ సమయంలోనే చెర్రీ రికార్డ్

Mon Jun 21 , 2021
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు. అసలు రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చారు. ముందుగా ఫేస్ బుక్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత చాలా కాలానికి ఇన్ స్టాగ్రాంలో అడుగుపెట్టారు.