Bank అదిరిపోయే ఆఫర్.. రూ.10 వేల క్యాష్‌బ్యాక్!

బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ.10 వేలు ఆదా చేసుకోవచ్చు. ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది.

ప్రధానాంశాలు:బ్యాంక్ అదిరే ఆఫర్ప్రతి లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ఆఫర్ కొద్ది కాలమేఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. తన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ లేదా పీఓఎస్ మెషీన్ ద్వారా కొనుగోలు చేస్తే భారీ క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. నవంబర్ 4 వరకు ఈ బెనిఫిట్స్ పొందొచ్చు.

ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా జరిపే ప్రతి లావాదేవీపై 1 శాతం క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. కొన్ని కొనుగోళ్లకు క్యాష్‌బ్యాక్ నుంచి మినహాయింపు కల్పించారు. సెప్టెంబర్ 17 నుంచే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.

డెబిట్ కార్డు లావాదేవీలపై గరిష్ట క్యాస్‌బ్యాక్ రూ.10 వేల వరకు పొందొచ్చు. ఏటీఎం క్యాష్‌ విత్‌డ్రాయెల్స్, ఈవాలెట్ మనీ లోడింగ్, ఈఎంఐ, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటికి క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించదు. 48 గంటలలోగా క్యాష్‌బ్యాక్ డబ్బులు కస్టమర్ ఖాతాలో జమవుతాయి.

Also Read: కొత్తగా బైక్, స్కూటర్ కొనే వారికి భారీ షాక్.. పండుగ సీజన్ ముందు..

Also Read: LIC అదిరే పాలసీ.. రూ.230 పొదుపుతో చేతికి రూ.17 లక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SBIలో అకౌంట్ ఉందా? నెలకు రూ.28తో రూ.4 లక్షల బెనిఫిట్ పొందండిలా!

Mon Sep 20 , 2021
PMSBY | మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు ఈ స్కీమ్స్‌లో చేరండి. నెలకు రూ.28 పొదుపుతో ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఎలానో తెలుసుకోండి.