కొత్తగా కారు కొనే వారికి శుభవార్త.. రూ.లక్షల్లో తగ్గింపు!

మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.

ప్రధానాంశాలు:కారు కొనే వారికి శుభవార్తభారీ తగ్గింపుఈ నెల చివరి వరకే ఆఫర్కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ నెలలో మాత్రమే ఆఫర్లు వర్తిస్తాయి.

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ కస్టమర్ల కోసం తగ్గింపు ప్రయోజనాలు అందిస్తోంది. రూ.1.5 లక్షల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. క్యా్ష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ వంటి వాటి రూపంలో తగ్గింపు అందుబాటులో ఉంది.

Also Read: రూ.లక్ష పెడితే.. ఏడాదిలోనే చేతికి రూ.8 లక్షలు.. కళ్లుచెదిరే రాబడి!

హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై రూ.లక్షా 50 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ కూడా కలిసి ఉంది. హ్యుందాయ్ ఐ20 కారుపై ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. రూ.10 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ తగ్గింపు పొందొచ్చు.

గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై కూడా తగ్గింపు లభిస్తోంది. రూ.35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఆరా కారుపై కూడా రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. కార్పొరేట్ తగ్గింపు రూ.5 వేలు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ కింద రూ.35 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. హ్యుందాయ్ శాంట్రో కారుపై రూ.25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. కాగా ప్రాంతం, షోరూమ్, వేరియంట్ ప్రాతిపదికన ఆఫర్ మారుతూ ఉంటుందని గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టీ20 క్రికెట్‌లో క్రిస్‌గేల్ నెం.1 రికార్డ్.. నెటిజన్లు ఫిదా

Tue Jul 13 , 2021
టీ20 క్రికెట్‌లో క్రిస్‌గేల్ మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌లు ఈ ఫార్మాట్‌లో 10వేల పరుగుల మార్క్‌ని అందుకునేందుకు ఆపసోపాలు పడుతుంటే.. గేల్ ఏకంగా 14,000 రన్స్ మైలురాయిని చేరుకున్నాడు.