ఇప్పట్లో స్కూళ్లు ప్రారంభించొద్దు… హైకోర్టులో సంచలన పిటిషన్

విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరుతూ.. ఇందులో ప్రతివాదులుగా విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్‌, నిపుణుల సలహా కమిటీలను చేరుస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు

ప్రధానాంశాలు:పాఠశాలల ప్రారంభాన్ని ఆపండిహైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంఈనెల 31న విచారణసెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అంశం హైకోర్టుకు చేరింది. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కరోనా సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ప్రత్యేక చర్యలను చేపట్టలేదని, ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు.

భౌతిక దూరం, పిల్లల హాజరు, ఆన్‌లైన్‌ తరగతుల నిలిపివేత తదితరాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, పిల్లలను పాఠశాలలకు పంపడంపై తల్లిదండ్రుల అంగీకార పత్రం అవసరమో లేదో కూడా పేర్కొనలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) నివేదిక ప్రకారం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్‌ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని,. పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌ కూడా వేయనందున ప్రభుత్వ నిర్ణయం ప్రమాదకరంగా మారనుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరుతూ.. ఇందులో ప్రతివాదులుగా విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్‌, నిపుణుల సలహా కమిటీలను చేర్చారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈనెల 31న విచారణ చేపట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Pawan Kalyan గురించి ఇలా ఎవ్వరూ మాట్లాడి ఉండరు!.. పరుచూరి కామెంట్స్ వైరల్

Sun Aug 29 , 2021
పరుచూరి గోపాల కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల నాడిని తెలుసుకుని మాటలు, కథలు, కథనాలు అందించడంలో దిట్ట. ఇక నటనలోనూ పరుచూరి గోపాల కృష్ణ మేటి.