ఏపీకి బిగ్ అలర్ట్: మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో..!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఒక ‘ఉపరితల ఆవర్తనం’ ఏర్పడింది. దీంతో తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు శనివారం ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వాతావరణం ఇలా ఉండనుందని తెలిపారు.

ఉత్తర కోస్తాంధ్రా, యానాం..
* ఆదివారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
* ఆది, సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
* మంగళవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రా..
* ఆదివారం, సోమవారం దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
* మంగళవారం దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ
* ఆదివారం, సోమవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
* మంగళవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వాడెవ్వడు.. మా సీఎం మహాత్ముని తిట్టడానికి.! మల్లారెడ్డి శాపనార్థాలు

Sun Sep 19 , 2021
మంత్రి మల్లా రెడ్డి మరోమారు నోటికి పనిచెప్పారు. తన పాత సహచరుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పురుగులపట్టి చచ్చిపోతాడంటూ శాపనార్థాలు పెట్టారు.