హాట్ బ్యూటీని టార్గెట్ చేసి‌న ఈడీ.. జాక్వెలిన్ వ్యవహారాలపై కన్నేసిన ఆఫీసర్స్! 200 కోట్ల స్కామ్..

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను మనీ లాండరింగ్, దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి విచారణకు పిలవడం హాట్ టాపిక్ అయింది. ఈ కేసు విషయమై సెప్టెంబర్ 25న ఈడీ ముందు హాజరు కావాలని ఆమెకు నోటీసులు అందాయట.

టాలీవుడ్‌లో డ్రగ్స్ ఇష్యూ మరోసారి ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పెడల్స్‌తో సెలబ్రిటీలకున్న సంబంధాలు, కెల్విన్‌తో ఆర్ధిక లావాదేవీలపై దృష్టి పెట్టింది ఈడీ. దీంతోపాటు మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను మనీ లాండరింగ్, దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి విచారణకు పిలవడం హాట్ టాపిక్ అయింది.

సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ ఇష్యూలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జాక్వెలిన్ వ్యవహారాలపై నిఘా పెట్టారని సమాచారం. ఈ మేరకు మరోసారి ఆమెను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 25 శనివారం నాడు ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని అధికారులు నోటీసులు పంపారట. ఈ విచారణలో 200 కోట్ల స్కామ్ గురించి ఆరా తీయబోతున్నారట.
Charmy Kaur: నిజంగా చెబుతున్నా.. హాట్ హాట్‌గా నా ఎదుట!! ఛార్మి రొమాంటిక్ మెసేజ్ వైరల్
అంతకుముందు ఆగస్టు 30వ తేదీన సుకేశ్ చంద్రశేఖర్‌పై కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఆమె నుంచి సమాచారం సేకరించారు. దీంతో ఇక్కడితో ఈ కేసు నుంచి జాక్వెలిన్ బయటపడిందని అంతా భావించగా.. మరోసారి ఈడీ ఆమె విచారణ కోరడం చర్చనీయాంశం అయింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు జాక్వెలిన్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Virat Kohli షాకింగ్ ప్రపోజల్ వెలుగులోకి.. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీకే ఎసరు

Fri Sep 17 , 2021
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతున్నట్లు మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న రోహిత్ శర్మని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోహ్లీ ఓ ప్రపోజల్‌ని సెలక్షన్ కమిటీ ముందుకు తీసుకెళ్లాడట