చంకల్లో దుర్వాసనా? ఈ చిట్కాలతో కంపు దూరం!

చంకల్లో దుర్వాసనతో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలను పాటిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.

ఒక పక్క వర్షం.. మరో పక్క తీవ్రమైన ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉక్కపోత వల్ల చర్మానికి చెమట పట్టి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చంకల్లో దుర్వాసన సమస్యతో బాధపడేవారికి ఈ సీజన్ మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్య వల్ల ఎవరి వద్దనైనా నిలుచుకోవాలన్నా.. చేతులు ఎత్తాలన్నా సంకోచిస్తారు. మీకు కూడా ఈ సమస్య ఉన్నట్లయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. చంకల్లో దుర్వాసన దూరం చేసే ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు హ్యాపీగా ఉండవచ్చు. వాస్తవానికి చంకల్లో పట్టే చెమట వాసన రాదు. కానీ, చంకల్లో పెరిగే బ్యాక్టీరియా వల్లే దుర్వాసన పుడుతుంది. ఆ బ్యాక్టీరియాకు చుక్కలు చుపించే ఆ చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

☀ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూనే వైరస్‌లు, బ్యాక్టీరియాలు దరిచేరవు. ఇది ప్రాథమిక సూత్రం కూడా.
☀ చంకలు దుర్వాసన వస్తే మరిగిన నీళ్లతో కాకుండా మొస్తారు వేడిగా ఉండే నీటితో రోజూ రెండు పూటల స్నానం చేయండి.
☀ ఏదైనా పనిమీద బయటకు వెళ్లి వచ్చినా, వ్యాయామం, ఇతరాత్ర పనులు చేసినా వెంటనే స్నానం చేయాలి.
☀ శుభ్రంగా లేకపోతే చంకల కింద ఏర్పడే చెమట బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. బ్యాక్టీరియా ముదిరి దుర్వాసన పెంచుతుంది. ☀ నిత్యం చంకలను శుభ్రం చేసుకుంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండదు. దుర్వాసన కూడా తగ్గుతుంది.
☀ రెడ్ మీట్ (పంది, గొర్రె, గొడ్డు మాంసం) తినేవారి నుంచి కూడా దుర్వాసన ఎక్కువగా వస్తుందని పరిశోధకులు తెలిపారు.
☀ రెడ్‌ మీట్‌కు బదులు చేపలు గానీ, చికెన్ గాని తినడం మంచిది.
☀ మీరు తీసుకునే ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి.
☀ వెల్లులి, ఉల్లిపాయల వల్ల శరీర దుర్వాసన పెరుగుతుంది.
☀ చంకల్లో పెరిగే వెంటుకల్లోనే బ్యాక్టీరియా పెరుగుతుంది.
కరివేపాకుతో బరువు తగ్గవచ్చా? ప్రయోజనాలేమిటీ?
☀ చంకల్లో వెంటుకలను తొలగించకపోతే దుర్వాసనను మరింత ఎక్కువగా ఉంటుంది.
☀ చంకలను షేవ్ చేసిన తర్వాత లేదా స్నానం చేసిన తర్వాత Benzoyl peroxide gel రాయండి (వైద్యుల సూచన అవసరం).
☀ బ్యాక్టీరియాను చంపడంలో నిమ్మకాయను మించినది మరేదీ లేదు. రోజూ చంకల్లో నిమ్మకాయ రుద్ది, కాసేపు ఆరనిచ్చి స్నానం చేయండి.
☀ కాటన్ దుస్తులు కూడా శరీరానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంపై చెమటను పీల్చుకుని చిరాకు రాకుండా చూస్తాయి.
☀ దుర్వాసన సమస్యతో బాధపడేవారు వేసవిలో సింథటిక్, పాలిస్టర్ వంటి దుస్తులు అస్సలు ధరించకూడదు.
☀ కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుని దుర్వాసన సమస్య లేకుండా చేస్తాయి.
వంటలకు నాన్ స్టిక్ ప్యాన్ అతిగా వాడుతున్నారా? మగాళ్లూ ‘అది’ జాగ్రత్త!
ముఖ్య గమనిక:ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎలాంటి బాధ్యత వహించదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

డయాలసిస్ చేయించుకున్నవారు ఈ ఫుడ్ తింటే మంచిదట..

Mon Jul 5 , 2021
శాకాహారం మాత్రమే తీసుకునే వారికి ప్రొటీన్ ఎక్కడ నుండి అందుతున్నది నాన్ వెజిటెరియన్స్‌కి ఉండే పెద్ద సందేహం. శాకాహారులకి ప్రొటీన్ అందదని చాలా మంది అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. శాకాహారం మాత్రమే తీసుకునే వారు హెల్దీ‌గా ఉండడానికి కూడా ఎన్నో ప్రొటీన్ సోర్సెస్ ఉన్నాయి.