ఆధార్ కార్డు ఉన్న వారికి హెచ్చరిక.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు!

ఆధార్ కార్డు లింక్‌తో ఇప్పుడు యూఐడీఏఐకి కొత్త చిక్కులు వచ్చాయి. ఒక వ్యక్తి ఆధార్ నెంబర్ ఆయనకు తెలియకుండానే విదేశాల్లోని రెండు కంపెనీలతో అనుసంధానం అయ్యింది. దీంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కారు.

ప్రధానాంశాలు:ఆధార్ కార్డు లింకింగ్ప్రమేయం లేకుండానే విదేశీ కంపెనీలతో అనుసంధానంకోర్టు నోటీసులుమీకు ఆధార్ కార్డు ఉందా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటారా? ఆధార్ చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. మన సమాచారం మొత్తం ఆధార్ కార్డులో నిక్షిప్తమై ఉంటుంది. అందువల్ల ఆధార్ కార్డుతో జాగ్రత్తగా ఉండాలి.

ఆధార్ లింకింగ్ అంశమై ఢిల్లీ హైకోర్టు తాజాగా కేంద్రానికి, యూఐడీఏఐకి నోటీసులు పంపింది. గర్మెంట్ ఎక్స్‌పోర్టర్ రాజన్ అరోరా పిటిషన్ మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజన్ అరోరాకు చెందిన ఆధార్ కార్డు నెంబర్ విదేశాల్లో రెండు కంపెనీలతో లింక్ అయ్యింది.

Also Read: నెలకు రూ.1,777 కడితే చాలు.. ఈ అదిరే స్కూటర్ మీ సొంతం!

దీంతో రాజన్ అరోరా కోర్టు తలుపు తట్టారు. ఆధార్ నెంబర్ యూరప్ కంపెనీలకు లింక్ కావడం వల్ల భవిష్యత్‌లో మనీ ల్యాండరింగ్, ఫోర్జరీ లేదంటే ఇతర మోసాలు జరగొచ్చని రాజన్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రాజన్ ప్రమేయం లేకుండానే ఆయన ఆధార్ నెంబర్ విదేశీ కంపెనీలతో లింక్ కావడం గమనార్హం.

Also Read: SBI కస్టమర్లకు అదిరిపోయే స్కీమ్.. ఈజీగా లోన్.. అధిక రాబడి!

విదేశీ కంపెనీలతో సంబంధం కలిగి ఉండటం వల్ల తన వ్యాపారం దెబ్బతినొచ్చని రాజన్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజన్ అరోరా యూఐడీఏఐని సంప్రదించారు. కొత్త ఆధార్ నెంబర్ జారీ చేయాలని కోరారు. అయితే దీనికి యూఐడీఏఐ అంగీకరించలేదు. ఒక వ్యక్తికి కేవలం ఒక్క ఆధార్ నెంబర్ మాత్రమే కేటాయించడం జరుగుతుందని, మరో నెంబర్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

ఒక పౌరుడి ఇష్టానికి, అభిరుచులకు అనుగుణంగా ఆధార్ నెంబర్ మార్చలేమని యూఐడీఏఐ తెలిపింది. కోర్టు కూడా ఈ అంశాన్ని అంగీకరించింది. అయితే యూఐడీఎఐకి ఒక విషయాన్ని తెలియజేసింది. సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని అన్వేషించాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ సమాధానాలు చెప్తే చాలు.. రూ.20 వేలు గెలిచే అవకాశం!

Wed Jul 14 , 2021
అమెజాన్ తన క్విజ్‌లో నేడు(జులై 14వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.20 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.