ప్యాంట్ మరిచింది.. షర్ట్ విప్పేస్తోంది.. హీటెక్కిస్తోన్న నందినీ రాయ్

ప్రస్తుతం నందినీ రాయ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నారు. ఓ తెలుగమ్మాయి తన సత్తా చాటడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో నందినీ రాయ్ చూపిస్తున్నారు. ఓటీటీలో విభిన్న కథలను ఎంచుకుంటూ తన కంటూ నటిగా ఓ గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

ప్రస్తుతం నందినీ రాయ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నారు. ఓ తెలుగమ్మాయి తన సత్తా చాటడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో నందినీ రాయ్ చూపిస్తున్నారు. ఓటీటీలో విభిన్న కథలను ఎంచుకుంటూ తన కంటూ నటిగా ఓ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. బోల్డ్ పాత్రలకు నందినీ రాయ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ప్రస్తుతం నందినీ రాయ్ చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు వెండితెరపై అవకాశాల కోసం ఎంతగానో ఎదురుచూశారు. సుధీర్ బాబుతో చేసిన సినిమాతో నందినీ రాయ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. నందినీ రాయ్‌కి ఫాలోయింగ్, క్రేజ్‌ను తెచ్చిపెట్టింది బిగ్ బాస్ షో. రెండో సీజన్‌లో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం, ట్రాకులు నడపడం, అందాలను ఆరబోయడంతో నందినీ రాయ్ పేరు సోషల్ మీడియాలో బాగానే మార్మోగిపోయింది. అలా నందినీ రాయ్‌ పేరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిపోయింది. ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్‌లో పెరిగింది.

నందినీ రాయ్ కాంట్రవర్సీ కామెంట్స్ అయితే బిగ్ బాస్ తరువాత నందినీ రాయ్ కెరీర్ పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ సినీ అవకాశాలు మాత్రం రాలేదు. అలా చాలా రోజుల తరువాత నందినీ రాయ్‌కి ఓటీటీల్లో మంచి ఆఫర్లు రావడం మొదలుపెట్టేశాయి. ఇప్పుడు నందినీ రాయ్ బోల్డ్ పాత్రల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మధ్యలో ఆమె చేసిన కాంట్రవర్సీ కామెంట్లు సైతం ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. ఇండస్ట్రీలోని మీటూ, క్యాస్టింగ్ కౌచ్ గురించి నందినీ రాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అంత మన చేతుల్లోనే ఉంటుందని నందినీ రాయ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి అంత ఎత్తున లేచారు. ఓటీటీలో నందినీ హల్చల్ ఓటీటీ కంటెంట్‌లకు నందినీ రాయ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. మెట్రో కథలు సినిమాలో వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తరువాత సుష్మిత కొణిదెల నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ షూట్ అవుట్ ఎట్ ఆలేర్ సినిమాలో నందినీ రాయ్ నటించారు. ఇక ఇప్పుడు నందినీ రాయ్ మరో వెబ్ సిరీస్‌తో హాట్ టాపిక్ అవుతున్నారు. మొన్నీ మధ్యే ఆహాలో వచ్చిన వెబ్ సిరీస్‌లో నందినీ రాయ్ బోల్డ్ పాత్రను పోషించారు. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్‌లో నందినీ రాయ్ పిచ్చెక్కించారు. అందంగా కనిపించడమే కాదు, చక్కగా నటించేశారు.రియలిస్టిక్‌గా ఉంటుందని.. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్‌లో భాగంగా నందినీ రాయ్ ఓ సీన్‌లో నిజంగానే రెచ్చిపోయారు. సీన్ రియలిస్టిక్‌గా వచ్చేందుకు నిజంగానే లాగి చెంపమీద కొట్టారట. అలా తనని కూడా కొట్టమని తన కో ఆర్టిస్ట్‌కు కూడా చెప్పారట. ఆ వాపు తగ్గాక మళ్లీ షూటింగ్ చేశారట. అలా వెబ్ సిరీస్ కోసం తాను చాలా కష్టపడ్డానని, మీనా పాత్ర చాలా బాగా వచ్చిందంటూ నందినీ రాయ్ చెప్పుకొచ్చారు. ఇక నందినీ తాజాగా సోషల్ మీడియాలో సెగలు పుట్టించేందుకు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తున్నారు. అందాల ఆరబోతతో నందినీ రాయ్ రచ్చ చేస్తున్నారు.ప్యాంట్ మరిచిపోయి.. తాజాగా నందినీ రాయ్ చేసిన అందాల విందు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్యాంట్ మరిచిపోయిన ఈ బిగ్ బాస్ బ్యూటీ.. షర్ట్ విప్పుతూ సెగలు పుట్టించేశారు. తనలోని హాట్ యాంగిల్‌ని అందరికీ చూపిస్తూ అదిరిపోయే ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోను చూసి నెటిజన్లంతా కూడా ఫైర్ ఎమోజీని కామెంట్లలో పెడుతున్నారు. బిగ్ బాస్ భాను శ్రీ సైతం నందినీ ఫోటోపై కామెంట్ పెట్టేశారు. హాట్ అంటూ ఆన్ ఫైర్ అన్నట్టుగా చెప్పేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో అందరినీ కట్టిపడేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. రూ.9 వేల భారీ తగ్గింపు!

Mon Jun 21 , 2021
కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి తీపికబురు. ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఆంపియర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరను తగ్గించేసింది. ఏకంగా రూ.9 వేల కోత విధించింది. దీంతో కొనే వారికి ఊరట కలుగనుంది.