విజయ్ దేవరకొండ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. ఆమెను తలచుకుంటూ అనన్య ఎమోషనల్ పోస్ట్

హీరోయిన్ అనన్య పాండే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె నానమ్మ, చుంకీ పాండే తల్లి నిన్న (శనివారం) ముంబైలో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు.

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె నానమ్మ నిన్న (శనివారం) ముంబైలో కన్నుమూశారు. వ‌యోభారం కార‌ణంగా అనారోగ్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. అనన్య పాండే తండ్రి చుంకీ పాండే తల్లి అయిన ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు కూడా నిన్ననే పూర్తి కాగా.. తాజాగా నానమ్మను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అనన్య. ఈ మేరకు ఆమె ఫొటో షేర్ చేశారు.

నానమ్మను 'నా దేవదూత' అని సంబోధించిన అనన్య.. ఆమె జన్మించినప్పుడు వైద్యులు ఆమె గుండె వాల్వ్ కారణంగా కొన్ని సంవత్సరాలు దాటి జీవించరని చెప్పారు, కానీ నా నానమ్మ అది నిజం కాదని నిరూపించి 85 సంవత్సరాల వయస్సు వరకు బ్రతికారు. పైగా ఎంతో శక్తితో ప్రతిరోజూ పని చేసేవారు. నా ఎదుగుదలలో ఆమెనే స్ఫూర్తి, ఆమెనే శక్తి ప్రదాత. మిమ్మల్ని ఎప్పటికీ మరువము అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది అనన్య పాండే.
'కత్తి మహేష్ చనిపోయాక ఇలా రాయడం ఏంటి అనే వాళ్లకి నా సమాధానం'
'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అనన్య పాండే.. ఆ తర్వాత ''పతి పత్ని ఔర్‌ వాహ్‌, ఖాళీ పీలీ'' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' సినిమాలో నటిస్తోంది. ముంబై బ్యాక్ డ్రాప్‌లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అనన్య బ్యూటిఫుల్ లుక్స్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి.
View this post on Instagram A post shared by Ananya ���� (@ananyapanday)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆ రోజులను గుర్తు చేసుకున్న ‘ఉరి’ హీరో.. ఎంతో ధన్యవాదాలు అంటూ పోస్ట్

Sun Jul 11 , 2021
అంతకు ముందుకు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ‘ఉరి’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు నటుడు విక్కీ కౌశల్. మొదటి నుంచి బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించిన అతను.. తాజాగా తన జీవితంలో ముఖ్యమైన రోజుని గుర్తు చేసుకున్నాడు.