ప్లీజ్ అలీగారూ!! మా మొర వినరా? హీరో వడ్డే నవీన్‌ కోసం ఎంత కాలం ఎదురుచూడాలి?

హీరోగాా 28 సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వడ్డే నవీన్.. నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలకు పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో కనిపించడమే మానేశారు.

కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఈ మధ్య కాలంలో కాస్త నాటకీయత ఎక్కువైందనే విమర్శ వినిపిస్తున్నప్పటికీ.. సీరియర్ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు-టెక్నీషియన్లు.. ఒకప్పుడు సినిమాల్లో, సీరియల్స్‌లో కనిపించి తెరమరుగైన చాలామంది నటీనటుల్ని కార్యక్రమంలో కనిపించడంతో మంచి వ్యూవర్ షిప్ సాధిస్తోంది ‘అలీతో సరదాగా’.

అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుదల చేసిన ప్రతిసారీ కూడా కింది కామెంట్లలో ఓ హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఆయనే వడ్డే నవీన్. 1997-2016 మధ్య ఈ హీరో పేరు ప్రముఖంగా వినిపించేది. వడ్డే రమేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్.. ‘పెళ్లి’, ‘కోరుకున్న ప్రియుడు’, ‘మనసిచ్చి చూడు’, ‘స్నేహితులు’, ‘నా హృదయంలో నిదురించే చెలీ’ ‘ప్రేమించే మనసు’, ‘బాగున్నారా’ లాంటి సినిమాలతో మంచి నటుడిగా పేరు సంపాదించాడు. కోడిరామక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి’ చిత్రం ఇతని కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా చూడటం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి క్యూ కట్టేవారు. అయితే దాదాపు 28 సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ సక్సెస్ రేటు ఎక్కువే.. నిర్మాతగా కూడా మూడు నాలుగు సినిమాలకు పనిచేశారు.

అయితే కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా ఫేడౌట్ నవీన్. ఇప్పుడసలు కనిపించడమే మానేశారు. ఆ మధ్య ఒక ల్యాండ్ ఇష్యూలో వార్తల్లో కనిపించారు. క్రిష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తన భూ సమస్యని పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించారు. తిరువూరు నియోజక వర్గం మాధవరంలో తన తల్లికి సంబంధించిన భూమిని భూసేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుందని అయితే నష్టపరిహారం అందచేయలేదని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు వడ్డే నవీన్.

ఆ తరువాత మీడియాలో కూడా ఈ హీరో కనిపించింది లేదు.. మంచి నటనతో సినిమాల్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు కనిపించకపోవడంతో ఆయన అభిమానులు అతని కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి దూరమైన ఎంతో మంది నటీనటులు అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో కనిపిస్తుండటంతో.. దయచేసి నవీన్‌ని ఈ కార్యక్రమానికి తీసుకుని రావాలని గత కొన్నేళ్లుగా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

అయితే పిలిచిన వాళ్లనే మళ్లీ మళ్లీ పిలిస్తున్నారు తప్పితే.. తమ రిక్వెస్ట్ గురించి పట్టించుకోవడం లేదని.. అలీ గారు దయచేసి వడ్డే నవీన్‌‌ని పిలవండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి సీరియర్ హీరోయిన్ గౌతమి రాగా.. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఆ ప్రోమోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎప్పటి నుంచో వడ్డే నవీన్‌ని పిలవమని చెప్తున్నా పట్టించుకోవడం లేదు.. మా మొర వినరా.. దయచేసి వడ్డే నవీన్‌ని ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి పిలవండి అలీ గారూ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే నవీన్‌తో హీరో వేణు కోసం కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
ఇష్టం అనుకుంటే ఇబ్బందే ఉండదు.. లేదంటే ఇండస్ట్రీకి రావడం మానేయాలి: కార్తీకదీపం భాగ్యం ఓపెన్ కామెంట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా వ్యాప్తికి కారణం అదే.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

Mon Apr 26 , 2021
దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ కరోనా భయంతో వణుకుతున్నాయి. అయితే సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తికి కారణం కేంద్రం ప్రభుత్వమే అంటూ మండిపడ్డారు ఎంపీ అసద్.