కొత్తగా బైక్, స్కూటర్ కొనే వారికి భారీ షాక్.. పండుగ సీజన్ ముందు..

కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. దేశీ అతిపెద్ద టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తన టూవీలర్ల ధరలు పెంచబోతోంది. ధరలు రూ.3 వేల వరకు పెరగనున్నాయి.

ప్రధానాంశాలు:కొనుగోలుదారలుకు ఝలక్కంపెనీ కీలక నిర్ణయంటూవీలర్లు కొనే వారిపై ప్రభావంమీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే దేశీ దిగ్గజ టూవీలర్ కంపెనీ హీరో మోటొకార్ప్ టూవీలర్ ఇంటికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటారా? బైక్ ధరలు పెరగనున్నాయి. దీంతో కొనుగోలుదారులపై ప్రభావం పడనుంది.

బైక్ ధరలు పెంచనున్నామని హీరో మోటొకార్ప్ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి బైక్ ధరలు పైకి కదలనున్నాయి. పండుగ సీజన్ ముందు కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో కొత్త హీరో బైక్ కొనాలని భావించే వారిపై ఎఫెక్ట్ పడుతుంది.

గ్రామాల్లో చాలా మంది హీరో బైక్స్‌నే ఎక్కువగా కొంటుంటారు. కాగా బైక్ ధరలు రూ.3 వేల వరకు పెరగనున్నాయి. బైక్ మోడల్ ప్రాతిపదికన ధరల పెంపు మారుతూ ఉంటుంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. కాగా కంపెనీ ఏప్రిల్ నెలలో కూడా టూవీలర్ల ధరలను రూ.2,500 వరకు పెంచిన విషయం తెలిసిందే.

Also Read: Andhra Bank కొత్త క్రెడిట్ కార్డు అదిరింది.. ఉచితంగానే..

Also Read: ఫోన్ పే వాడే వారికి షాక్.. అలా చేస్తే ఇకపై అదనపు చార్జీలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

LIC అదిరే పాలసీ.. రూ.230 పొదుపుతో చేతికి రూ.17 లక్షలు!

Mon Sep 20 , 2021
ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు పలు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఎల్‌ఐసీ పాలసీల్లో జీవన్ లాభ్ కూడా ఒకటుంది. ఈ పాలసీతో రెండు ప్రయోజనాలు పొందొచ్చు.