ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా లాంచ్.. ఈసారి వపర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆది. విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు అతను.. తాజాగా అతను నటిస్తున్న కొత్త సినిమా లాంచ్ అయింది.

‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు నటుడు ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట కొన్ని రొటీన్ సినిమాలే చేసినా.. ఆ తర్వాత విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్‌గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్తలు పాటిస్తున్నాడు అతను.

ప్రస్తుతం అతను 'అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1'అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆది కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఎస్.బాలవీర్ రచన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్‌వీఆర్ నిర్మిస్తున్నారు. అవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది తండ్రి సాయి కుమార్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆది తన కెరీర్‌లోనే తొలిసారగా ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న సినిమా ఇది. దాదాపు రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ప్రస్తుతం షూటింగ్‌కి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది.

తొలి షెడ్యూల్‌లో భారీ ఖర్చుతో రూపొందించిన పోలీస్ సెట్‌లో కొన్ని సీన్లతో పాటు, నగర శివార్లలో కూడా కొన్ని సీన్స్ తీయనున్నారు. అంతేకాక.. ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉండబోతోంది అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య సంగీతం అందిస్తుండగా.. ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రాఫీ అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వివో ఎస్10 సిరీస్ వచ్చేసింది.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో!

Fri Jul 16 , 2021
వివో తన ఎస్10 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. వివో ఎస్10, ఎస్10 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. వివో ఎస్10 ప్రోలో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.