పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవడం ఎలా? ఇంట్లో నుంచే పని పూర్తి చేసుకోండిలా!

మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీ పీఎఫ్ ఖాతాతో ఆధార్ నెంబర్ కచ్చితంగా లింక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు ఆన్‌లైన్‌లోనే ఈ పనిని పూర్తి చేయొచ్చు.

ప్రధానాంశాలు:పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్యూఏఎన్‌తో ఆధార్ లింక్ చేసుకోవాలిలేదంటే ఇబ్బందులుమీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. పీఎఫ్ ఖాతాతో ఆధార్ నెంబర్‌ను కచ్చితంగా లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. ఇంకా కంపెనీల కంట్రిబ్యూషన్ కూడా ఆగిపోతుంది.

అందుకే పీఎఫ్ ఖాతాతో కచ్చితంగా ఆధార్ లింక్ చేసుకోవాలి. మీరు దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం మీరు ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లాలి. లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్ సర్వీసెస్‌లోకి వెళ్లి ఈకేవైసీపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. మీ పీఎఫ్ ఖాతాతో ఆధార్ లింక్ అవుతుంది.

Also Read: స్మార్ట్‌ఫోన్, టీవీ,ల్యాప్‌టాప్ కొనే వారికి షావోమి గుడ్ న్యూస్.. రూ.11 వేల భారీ తగ్గింపు!

ఒకవేళ ఆధార్ నెంబర్ లింక్ కాకపోతే ఏం చేయాలి? పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో ఏమైన తప్పులు ఉంటే ఆధార్ నెంబర్ లింక్ కాదు. అప్పుడు మీరు మై ప్రొఫైల్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ పేరును ఇతర వివరాలను ఆధార్ కార్డులో మాదిరిగా సరి చేసుకోవాలి.

ఇప్పుడు మీరు పని చేసే కంపెనీ మీరు చేసిన సవరణలకు ఓకే చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్లీ ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. ఇక్కడ పీఎఫ్ ఖాతాతో, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్లు మీ వద్దనే ఉండాలి. లేదంటే ఇబ్బదులు పడాల్సి వస్తుంది. పీఎఫ్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ మూడు లక్షణాలు ఉంటే షుగర్ వ్యాధి ఉన్నట్లేనట..

Tue Jul 13 , 2021
విశ్వవ్యాప్తంగా చాలా మంది టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో గ్లూకోజ్ ఎక్కువైపోవడం కారణంగా వివిధ రకాల లక్షణాలను గమనించవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయని కానీ ఎవరూ గుర్తించడం లేదని డాక్టర్లు చెబుతున్నారు.