తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు

వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

అల్పపీడనానికి అనుబంధంగా గుజరాత్‌లోని కచ్ వరకు ఉపరిత ద్రోణి ఆవరించిందని, మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పార్టీ మార్పుపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Tue Jul 13 , 2021
కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలపై తన భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డీ టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికయ్యే విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.