బంగాళఖాతంలో అల్పపీడనం… తెలంగాణకు భారీ వర్షాలు

రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అతిభారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. మరోవైపు రుతు పవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి.

ప్రధానాంశాలు:బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుపలు జిల్లాలకు భారీ వర్షాలు ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక వర్షాలు కురుస్తాయని, 11, 12, 13 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అల్పపీడనం మరింత బలపడి భారీ ఉరుములు, మెరుపులతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అతిభారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది.
మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్ అక్రమాస్తుల కేసు: ఆమెకు భారీ ఊరట.. సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు

Sat Jul 10 , 2021
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టులో ఊరట లభించింది.