తెలంగాణకు భారీ వర్షసూచన… ఆ జిల్లాలకు అలర్ట్

కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో నదులు, చెరువులు పరవళ్లు తొక్కుతున్నాయి. అయితే రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రధానాంశాలు:బంగాళాఖాతంలో అల్పపీడనం పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలుహైదరాబాద్‌ రోడ్లను ముంచెత్తిన వానబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

మరోవైపు హైదరాబాద్‌ నగరాన్ని శనివారం కూడా వరుణుడు పలకరించాడు. పలుచోట్ల కురిసిన భారీ వర్షం రహదారులను ముంచెత్తింది. కుత్బుల్లాపూర్‌, బండ్లగూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, అమీర్‌పేట, సోమాజిగూడ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోనూ శనివారం భారీ వర్షాలు కురిసాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అత్యధికంగా 5.5 సెం.మీ, సరూర్‌నగర్‌లో 5.2 సెం.మీ, మాడ్గుల్‌, నందిగామ, బంట్వారంలో 4.8సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పారాలింపిక్స్‌లో భవీనా పటేల్‌కి రజతం.. సరికొత్త చరిత్ర

Sun Aug 29 , 2021
పారాలింపిక్స్‌లో పసిడి గెలిచేలా కనిపించిన టీటీ ప్లేయర్ భవీనా పటేల్.. ఊహించని విధంగా ఫైనల్లో ఓడిపోయింది. వరుస గేమ్‌లలో ఓడిన భవీనా రజతంతో సరిపెట్టింది.