పిడుగులు పడుతుండగా సెల్ఫీల కోసం ఆరాటం.. 11 మంది మృతి

రాజస్థాన్‌లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది వరకూ గాయపడ్డారు. జయపూర్‌లో వర్షం పడుతుండగా సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలుమీదకు తెచ్చుకున్నారు.

ప్రధానాంశాలు:ఆరుగురి ప్రాణాలుమీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.పిడుగు పాటుకు చనిపోయిన ఏడుగురు చిన్నారులు.బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం గెహ్లాట్.రాజస్థాన్‌లో ఆదివారం పిడుగుపాటు ఏడుగురు చిన్నారులు సహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగులు పడుతుండగా సెల్ఫీలకు ప్రయత్నించి 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌ రాజధాని జయపురలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా.. జయపూర్ నగరంలోని కోట వద్ద వాచ్ టవర్ వద్ద ఉన్న పర్యాటకులు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో భారీ శబ్దాలతో పిడుగులు పడటం వల్ల చాలా మంది భయంతో కిందకు దూకేశారు.

కొండపై నుంచి కిందకు దూకేసిన 29 మందిని పోలీసులు రక్షించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. వీరికి సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

‘కోటా జిల్లా కన్వాస్ గ్రామంలో నలుగురు చిన్నారులు, ధోల్‌పూర్ జిల్లా బడీ కుదీనా గ్రామంలో ముగ్గురు పిల్లలు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం… విషాద సమయంలో చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో నెలకున్న వాతావరణ పరిస్థితులపై సోమవారం అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో గెహ్లాట్ సమావేశం కానున్నారు. ఇక, రాజస్థాన్‌‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పిడుగు పాటుకు కోటా జిల్లాలో నలుగురు, ధోల్‌పూర్ జిల్లాలోని బడీలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కేరళలో కొత్తగా మరో ముగ్గురికి జికా వైరస్.. 18కి చేరిన బాధితులు

Mon Jul 12 , 2021
కేరళలో గతవారం జికా వైరస్ వెలుగుచూసింది. తొలుత ఓ గర్బిణికి వైరస్ నిర్దారణ కాగా.. తర్వాత పుణేలోని ఎన్ఐ‌వీకి పంపిన 19 శాంపిల్స్‌లో 13 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది.