అమెరికా వెళ్లేవారికి ఊహించని షాక్.. ఎకానమీ క్లాస్‌కే ట్రిపుల్ రేటు

కరోనా కేసుల ప్రభావం అంతర్జాతీయ విమాన రాకపోకలపై పడింది. ఇప్పటికే యూకే, యూఏఈ, జర్మనీ వంటి దేశాలు ఇండియా నుంచి రాకపోకలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. దీంతోో విమాన టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి

ప్రధానాంశాలు:అమెరికా విమానాలకు పెరిగిన రద్దీకఠిన ఆంక్షల అనుమానంభారీగా పెరిగిన టిక్కెట్ ధరలుదేశంలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడం విమానయానంపై భారీ ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు దేశాలు ఇండియా నుంచి రాకపోకలపై నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. యూఏఈ పది రోజుల పాటు ఇండియా విమాన రాకపోకలను పూర్తిగా నిషేధించింది. అటు యూకే, జెర్మనీ వంటి దేశాలు కూడా ఇండియా నుంచి విమానాల రాకపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఆ ప్రభావం అమెరికా వెళ్లేవారిపై పడింది.

ఇండియా నుంచి వచ్చే విమానాలపై అమెరికా నిషేధం విధించకపోయినప్పటికీ.. భారత్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ నుంచి రాకపోకలపై నాలుగో లెవెల్ ట్రావెల్ అడ్వైజరీ నిబంధనలను పాటించనున్నట్లు పేర్కొంది. అమెరికా నిబంధనల ప్రకారం ఇండియా నుంచి రావొచ్చు కానీ.. అమెరికా నుంచి ఇండియాకి వెళ్లకూడదని ఇప్పటికే తమ పౌరులకు అగ్రరాజ్యం ఆదేశాలిచ్చింది. నిబంధనల పుణ్యమాని ఇండియా నుంచి అమెరికా వెళ్లే వారిపై భారీగా అదనపు భారం పడింది.

రానున్న రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు ఇలాగే కొనసాగితే అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అప్పటిలోగా ఇండియా నుంచి అమెరికా వెళ్లిపోయేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దీంతో అమెరికా వెళ్లే విమానాలకు రద్దీ పెరిగి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ రోజుల్లో అమెరికా వెళ్లేందుకు టిక్కెట్ ఫేర్ సుమారు రూ.50 వేల వరకూ ఉంటుంది. కానీ రద్దీ కారణంగా ప్రస్తుతం రూ.1.5 లక్షలకు చేరినట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. టిక్కెట్ ధర అమాంతం మూడు రెట్లు పెరిగిపోయింది.

అటు దేశంలోని చార్టర్డ్ విమానాలకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీలో చార్టర్డ్ ఫ్లైట్స్ నిర్వాహకుడు చెప్పారు. కరోనా రోగులను పెద్ద నగరాలకు తీసుకెళ్లేందుకు ఎయిర్ అంబులెన్సు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరలు కూడా రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు.

Also Read: Breaking: ముంబైలో సీన్ రివర్స్.. ఒక్కరోజులో భారీగా తగ్గిన కేసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బ్రహ్మానందంకి అలాంటి పాత్ర.. దర్శకేంద్రుడి వినూత్న ప్రయోగం

Sun Apr 25 , 2021
బ్రహ్మానందం గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలాకాలం తర్వాత ఆయన ‘జాతిరత్నాలు’ సినిమాలో జడ్జి పాత్రలో కనిపించి తన హావభావాలతోనే నవ్వులు పూయించారు. అయితే ఇప్పుడు బ్రహ్మానందంతో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు ఓ వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారట.