మూసీ నదికి భారీగా వరద నీరు.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. మూరీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

ప్రధానాంశాలు:నిండు కుండను తలపిస్తున్న మూసీనాలుగు గేట్లు ఎత్తివేసిన అధికారులు మొత్తం ఇన్ ఫ్లో 4000 క్యూసెక్లులుతెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. అన్ని ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భారీగా వస్తున్న వరదతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 642.5 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 645 ఫీట్లుగా ఉంది. దీంతో మొత్తం నాలుగు గేట్ల ( 2,4,6,8) ద్వారా 2,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. క్రస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువున ఉన్న లోతట్టు ప్రాంతాలను, నది సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.. చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సమాచారం అందించారు.
నిండుకుండలా మారిన మూసీ.. భారీగా వరద నీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఫ్రెండ్స్‌తో MS Dhoni లంచ్.. వైరల్‌గా మారిన ధోనీ న్యూలుక్ ఫొటో

Wed Jul 14 , 2021
క్రికెట్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఉన్న మహేంద్రసింగ్ ధోనీ.. మైదానం వెలుపల చాలా సింపుల్‌గా ఉంటాడు. మరీ ముఖ్యంగా.. ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఈ కెప్టెన్ కూల్