వీటిని తింటే ఐరన్ లోపం తగ్గుతుందట..

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. సరైన పోషకాహారం రెగ్యులర్ డైట్‌లో తీసుకుంటూ ఉండాలి. మన బాడీకి అవసరమయ్యే పోషక పదార్థాలలో ఐరన్ కూడా ఒకటి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఐరన్ మనకి చాలా ముఖ్యమని… ముఖ్యంగా రెస్పిరేషన్, సరైన ఇమ్యూన్ ఫంక్షన్‌కి చాలా అవసరమని తెలుస్తోంది.

ప్రధానాంశాలు:ఐరన్ లోపంతో ఎన్నో సమస్యలుకొన్ని ఆహార పదార్థాలతో సమస్య దూరంఐరన్ లోపం ఉండడం వల్ల ఎనీమియా మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐరన్ తక్కువగా ఉండటం వల్ల తల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం ఐరన్ లోపం 33 శాతం మహిళల్లో కనబడుతుందని… 40 శాతం గర్భిణీలలో.. 42 శాతం పిల్లల్లో కనబడుతోందని మనకి తెలుస్తోంది. అందుకనే నిపుణులు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు గురించి తెలియజేశారు.

కనుక ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మంచిది. చాలా మంది ఐరన్ ఏ కదా అదే వస్తుందిలే అని టెక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కానీ అలా చెయ్యడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం విషయం లో ఎప్పుడు కూడా లైట్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే సమస్య చిన్నగా ఉంటేనే సాల్వ్ చెయ్యడానికి కుదురుతుంది. పెద్దది అయితే దాని నుండి బయటకి రావడం నిజంగా కష్టం. ఇది ఇలా ఉంటే ఐరన్ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని తెలుసుకోవాలి.
రోజుకి ఎన్ని గుడ్లు తినాలి.. ఎక్కువ తింటే మంచిది కాదట జాగ్రత్త..
ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఐరన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ఐరన్ ఎందులో ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం.ఐరన్ లోపం కలగకుండా ఉండాలంటే డైట్‌లో ఈ ఆహార పదార్థాలను తీసుకోండి:

హైడ్రేట్‌గా ఉండండి:

ఆహారం కంటే ముఖ్యమైనది మంచి నీళ్లు. నీళ్ళే కదా అని పట్టించుకోవడం మానేయద్దు. నీళ్లు నిజంగా బాడీకి చాలా అవసరం. ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు అయితే నిజంగా నీళ్లు అంత ముఖ్యమా అని ఆలోచిస్తున్నారా..? అవునండి మనం తీసుకునే నీళ్లు కూడా మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయి.

సరిగ్గా నీళ్లు తీసుకుని హైడ్రేట్‌గా ఉంటే ఎనిమియా సమస్యకు దూరంగా ఉండవచ్చు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బులెటిన్ రీసెర్చర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తే… మంచి నీళ్లు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం కలగదని అంటున్నారు కాబట్టి హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం అని తెలుసుకుని.. ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగండి.
మగవారికి ఈ సమస్య ఉంటే శృంగారం సరిగ్గా చేయలేరట..
మీరు కనుక వట్టి మంచి నీళ్లు తాగ లేకపోతే నీటి యొక్క ఫ్లేవర్‌ని మార్చుకోవచ్చు. ఉదాహరణకు అందులో రెండు తులసి ఆకులు వేసుకుని రుచి మార్చుకోవచ్చు లేదా పుదీనా, నిమ్మరసం ఇలా ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా నీళ్ళని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. పైగా చాలా సమస్యలు మీకు రావు. ముఖ్యంగా ఐరన్ సమస్యలు కూడా ఉండవు.

ఆకుకూరలు తీసుకోండి:

చాలా మంది ఆకు కూరలు అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆకు కూరల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు తరిమికొట్టొచ్చు. అయితే ఆకు కూరల్లో ఐరన్ కూడా ఉంటుంది అని గ్రహించండి. పాలకూర కాలే మొదలైన ఆకు కూరల్లో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది.

కాబట్టి వీలైనంత వరకు ఆకు కూరలను కూడా మీ డైట్ లో చేర్చండి. ఆకుకూరల తో మనం వివిధ రకాల రెసిపీస్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు పాల కూర తో పాలక్ పన్నీర్ వంటివి ఎంతో రుచిగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొత్త కొత్త రెసిపీలని కూడా ఆకు కూరలతో ప్రయత్నం చేసి ఏదో రూపం లో తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.

విటమిన్ సి తీసుకోండి :

అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటటిక్స్ ప్రకారం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో విటమిన్ సి కూడా తప్పక ఉండేటట్లు చూసుకోండి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో పాటు విటమిన్ సి కూడా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా విటమిన్-సి ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం కలగదు అని చెబుతున్నారు. కాబట్టి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా మీరు డైట్‌లో తీసుకోండి. ఎనిమియా సమస్య లేకుండా వుండండి.

మాంసం మరియు పౌల్ట్రీ:

చికెన్, మటన్ మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వాటిలో ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా ఐరన్ లోపం కలగకుండా కూడా ఇది జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి వీటిని కూడా తప్పకుండా డైట్ లో తీసుకోండి.

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కాల్షియంతో పాటు తీసుకోకండి :

ఈ తప్పు కనుక మీరు చేస్తుంటే సరిదిద్దుకోండి. ఎందుకంటే ఐరన్ తో పాటు క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఐరన్ తీసుకో వద్దు. అదే ఐరన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు.
ఈ రెండు తింటే ఎక్కువరోజులు బతుకుతారట..
ఎందుకంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను క్యాల్షియం ఉండే ఆహార పదార్థాల తో కలిపి తీసుకోవడం వల్ల క్యాల్షియం ఐరన్ యొక్క అబ్సర్ప్షన్ ని బ్లాక్ చేస్తుంది కాబట్టి ఈ తప్పులు చేయొద్దు. మరి నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను చూశారు కదా మరి ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి ఐరన్ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఐరన్ ఉండే ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండచ్చు. ఎనిమియా వంటి సమస్యలకి కూడా దూరంగా ఉండచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

YS Jagan‘ఏలూరు రోడ్డులోని ఆ ఇంట్లో మంత్రి లావాదేవీలు.. ఫుటేజ్ బయటకొస్తే..’ జనసేన సంచలన వ్యాఖ్యలు

Mon Sep 20 , 2021
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను తరచూ టార్గెట్ చేసే జనసేన పార్టీ.. తాజాగా, ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు గుప్పించింది.