వానాకాలంలో కచ్చితంగా కాకరకాయ తినాలట.. ఎందుకంటే..

వానాకాలం మొదలైందంటే ప్రతి భారతీయుడి గుండె ఆనందంతో గంతులేస్తుంది.. వాన కురిసినప్పుడు వచ్చే మట్టి వాసన, పచ్చ పచ్చని ఆకులు, చిన్నప్పటి కాగితం పడవలు వదిలిన ముచ్చటైన జ్ఞాపకాల పరిమళం మనసుని మధురంగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇంకా, గొడుగులు తెరిచి చూసుకోవడం, రెయిన్ కోట్స్‌కి ఏమైనా రిపెయిర్ చేయినా చాలేమో చెక్ చేసుకోవడంలాంటి ప్రాక్టికల్ పనులు కూడా చేస్తామనుకోండి. వీటన్నింటితో పాటూ ఉండే ఇంకొక సరదా వేడి వేడి పకోడీలు ఆ తరువాత గరం గరం చాయ్.. ఇంక చెప్పేదేముంది..

ప్రధానాంశాలు:వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం ముఖ్యంరోగ నిరోధక శక్తి కోసం హెల్దీ డైట్ తీసుకోవాలని నిపుణుల సలహాపకోడీలు, బజ్జీలు, టీ, కాఫీ లేని వానాకలం సాయత్రం గడవదు కానీ మనందరం గుర్తు పెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం వానాకలం తనతో పాటూ కొన్ని ఆరోగ్య సమస్యలని కూడా తీసుకు వస్తుందని. ఈ సమయంలో మనం తీసుకునే ఫుడ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ గా ఉండడమే కాదు, గట్‌కి కూడా హెల్ప్ ఫుల్‌గా ఉండాలి. కాబట్టి, పకోడీలతో పాటూ ఇవి కూడా తీసుకోవడం మర్చిపోకండి.
ఒత్తిడి తగ్గేందుకు ఏం తినాలి.. ఏం తినకూడదంటే..
1. సీజనల్ ఫ్రూట్స్ – బొపాయి, లిచీ, యాపిల్స్, పియర్స్ వంటి సీజనల్ ఫ్రూట్స్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలని కూడా అందిస్తాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్, విటమిన్స్ అందుతాయి. గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.

2. వెల్లుల్లి – హ్యూమన్ బాడీ యొక్క మెటబాలిజంని మెయింటెయిన్ చేసే సూపర్ ఫుడ్స్‌లో వెల్లుల్లి కూడా ఒకటి. పప్పు, రసం, సాంబారు, సాస్ వంటి వాటిలో వెల్లుల్లిని కలపడం ద్వారా మనం దీని రోజూ తీసుకోగలం. ప్రతి ఇండియన్ కిచెన్‌లోనూ ఉండే వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వంటి దినుసులు మనని కామన్ కోల్డ్, ఫ్లూ నించి ప్రొటెక్ట్ చేస్తాయి.
పూజాగది ఈ దిక్కున ఉంటే చాలా మంచిదట.. 3. చేదు – మెంతికూర, కాకర కాయ వంటి వాటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నీటి ద్వారా, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులని అడ్డుకునే శక్తి మనకి వస్తుంది. ఇవి విటమిన్స్ ఏ, సీ, బీ, ఐరన్, జింక్‌తో నిండి ఉంటాయి.

4. పెరుగు – గట్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఒక ప్రోబయాటిక్ ఇంగ్రీడియెంట్ మీ ఆహారంలో ఉండి తీరాలి. ఇది పాథోజెన్స్ ని దూరంగా ఉంచుతుంది. పెరుగు లో ఉండే మంచి బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్స్ హి హెల్దీగా ఉంచుతుంది.

5. తేనె – తేనె అరుగుదలకి సహకరిస్తుంది, బాడీకి కావాల్సిన శక్తినిస్తుంది. అంతే కాక తేనెలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వలన తేనె తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

6. నీరు – వీటన్నింటి తో పాటూ తప్పని సరిగా, గుర్తు పెట్టుకుని మరీ తీసుకోవాల్సిన పదార్ధం మంచి నీరు. నీటిని కాచి చల్లార్చి కానీ ఫిల్టర్ చేసి కానీ తాగాలి. నీరు మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. మీకు కావాలనుకుంటే ఆరెంజ్, కీరా, పుదీనా కూడా మీరు తాగే నీటికి కలుపుకుని తాగవచ్చు.
తల్లి బిడ్డకి ఇలా పాలిస్తే చాలా మంచిదట..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జైల్లో ఖైదీలతోనే మహిళా ఆఫీసర్ శృంగారం.. ఓసారి 11 మంది చూస్తుండగానే ఖైదీతో సెక్స్!

Mon Jul 5 , 2021
ఖైదీల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చి, వారు తప్పుచేస్తే మార్గదర్శనం చేయాల్సిన మహిళా అధికారిణి పెడదారి పట్టింది. ఏకంగా ఖైదీలతోనే లైంగిక చర్యల్లో మునిగితేలింది.