Nagarjuna: మాటలు చాలవు మామ అంటూ సమంత ట్వీట్! అక్కినేని కోడలి సందేశం వెనుక రీజన్ అదేనా?

ఈ రోజు (ఆగస్టు 29) అక్కినేని నాగార్జున జన్మదినం. ఈ సందర్భంగా అక్కినేని కోడలు సమంత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ రోజు (ఆగస్టు 29) అక్కినేని నాగార్జున జన్మదినం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు అభిమాన లోకం, ఇటు సినీ లోకం పెద్దఎత్తున బర్త్ డే విషెస్ అందిస్తుండగా.. అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత.. తన మామకు స్వీట్ విషెస్ పోస్ట్ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయింది.

ఇటీవలే అక్కినేని కోడ‌లు స‌మంత త‌న సోషల్ మీడియా ఖాతాల్లోంచి అక్కినేని అనే పేరు తొలగించింది. కేవలం S అనే అక్షరంతో తన ప్రొఫైల్ నేమ్ అప్‌డేట్ చేసింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కినేని కుటుంబంతో సమంతకు విభేదాలు తలెత్తాయా? అనే కోణంలో కామెంట్స్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి.

ఈ పరిస్థితుల నడుమ ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై రియాక్ట్ అవుతూ.. తన చుట్టూ ఏర్పడ్డ వివాదాల గురించి తనకు నచ్చినప్పుడే మాట్లాడతానని చెప్పింది సమంత. ఇలాంటి విషయాలపై ఇప్పుడైతే స్పందించాలనుకోవడం లేదని అనడంతో సదరు ఇష్యూ ఇంకాస్త చర్చనీయాంశం అయింది. అయితే మామ నాగార్జునను ఉద్దేశిస్తూ తాజాగా సమంత చేసిన ట్వీట్ జనాల్లో నెలకొన్న ఆ అనుమానాలను పటాపంచలు చేసిందని చెప్పుకోవచ్చు.
God Father: చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న గద్దర్! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్
''మీ ప‌ట్ల నా గౌర‌వాన్ని వ‌ర్ణించ‌డానికి మాటలు చాలవు. ఎల్ల‌ప్పుడు మీరు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే మామ'' అని పేర్కొంది సమంత. అక్కినేని కుటుంబంపై, తన మామపై ఉన్న గౌరవాన్ని మరోసారి ఇలా వ్యక్తం చేయడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు అక్కినేని అమల, నాగ చైతన్య, అఖిల్ తమ తమ విషెస్ అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

PV Sindhu హైట్ మీద ‘చిరు’ హాస్యం.. రానా ఎంట్రీతో ‘మెగా’ సెటైర్లు!

Sun Aug 29 , 2021
మెగాస్టార్ చిరంజీవిలోని చతురత గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెరపై ఎంత చమత్కారంగా ఉంటారో నిజ జీవితంలోనూ అంతే ఉంటారు. ఇక ఆ మధ్య ట్విట్టర్‌లో ఆయన దూకుడు చూసి అందరూ షాక్ అయ్యారు.