పెళ్లైన కొత్తలో భార్యకు చెప్పకుండా ఆ పనిచేశా.. నువ్వులు పూయించిన కేంద్ర మంత్రి!

హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. రహదారుల విస్తరణకు అడ్డంగా ఉన్న తన అత్తవారి ఇంటిని కూల్చివేయాలని భార్యకు తెలియకుండా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

ప్రధానాంశాలు:ఢిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే పనులపై మంత్రి సమీక్ష.కోవిడ్ బారినపడినప్పుడు గరెట తిప్పినాన్న కేంద్ర మంత్రి.మామగారి ఇంటిని కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని పెళ్లయిన కొత్తలో జరిగిన ఓ విషయం గురించి చెప్పి సభలో నవ్వులు పూయించారు. వివాహం జరిగిన తర్వాత తాను భార్యకు చెప్పకుండానే రోడ్డు మధ్యలో ఉన్న మామ ఇంటిని కూల్చివేయాలని ఆదేశించినట్టు తెలిపారు. ఢిల్లీ -ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కొత్తగా వివాహం చేసుకున్నపుడు జరిగిన సంఘటన గురించి మంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేసుకున్నారు.

‘‘నాకు వివాహమైన కొత్తలో మా మామగారి ఇల్లు రహదారికి మధ్యలో ఉండేది.. రోడ్డు నిర్మాణం కోసం ఇంటిని కూల్చివేయాల్సిన అవసరం ఉందని అధికారులు నాకు వివరించారు.. దీంతో ఆ విషయం నా భార్యకు చెప్పకుండా, నేను మా మామగారి ఇంటిని కూల్చివేయమని అధికారులను ఆదేశించాను.’’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక, కోవిడ్-19 బారినపడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నదీ ఈ సందర్భంగా గడ్కరీ వెల్లడించారు.

వంటచేయడం, ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇచ్చి క్వారంటైన్‌ గడిపానని తెలిపారు. ‘ఆన్‌లైన్ ద్వారా పలు ఉపన్యాసాలు చేసి, వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. వాటికి భారీ స్పందన రావడంతో యూట్యూబ్ నుంచి నెలకు ప్రస్తుతం రూ.4 లక్షలు అందుతున్నాయి’ అన్నారు.

ఈ కార్యక్రమంలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, గురుగ్రామ్ ఎంపీ రావు ఇందర్‌జిత్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిపాలన, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పాల్గొన్నారు. హరియాణాలో జాతీయ రహదారికి సంబంధించిన దాదాపు 160 కిలోమీటర్ల పనులు మార్చి 2022 నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ.95 వేల కోట్లతో నిర్మిస్తున్నారు. మొత్తం నిర్మాణం 2023 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SCO Summit అఫ్గన్ పరిణామాలను ఉటంకిస్తూ పాక్, చైనాలకు మోదీ చురకలు!

Fri Sep 17 , 2021
తజికిస్థాన్ రాజధాని దుషాంబే వేదికగా జరుగుతున్న షాంఘై సహకార కార్పొరేషన్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపాకిస్థాన్, చైనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.