కేంద్రం గుడ్ న్యూస్.. ఈ కార్డుతో రూ.2 లక్షల బెనిఫిట్.. ఉచితంగానే పొందండిలా!

కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

ప్రధానాంశాలు:కార్మికులకు శుభవార్తకొత్త పోర్టల్ అందుబాటులోరూ.2 లక్షల ఉచిత బీమాకేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వివిధ వర్గాల ప్రజలు ఆధారంగా వివిధ రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త పోర్టల్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా అసంఘటిత రంగ కార్మికులకు బెనిఫిట్ కలుగనుంది.

మోదీ సర్కార్ ఇశ్రమ్ వెబ్‌సైట్ తీసుకువచ్చింది. అసంఘటిత కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరు నమోదు చేసుకున్న వారికి పలు రకాల బెనిఫిట్స్ లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందొచ్చు.

Also Read: శుభవార్త.. పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే..

అంతేకాకుండా రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు.

మీరు సులభంగానే ఇశ్రమ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వొచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు కట్టక్కర్లేదు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఉంటే సరిపోతుంది. సులభంగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూఏఎన్ నెంబర్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు లాంచ్ చేసిన ఎంఐ.. మంచి పెర్ఫార్మెన్స్ కోరుకునేవారికి బెస్ట్!

Fri Aug 27 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. అవే ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా, ఎంఐ నోట్‌బుక్ ప్రో. వీటి ధర రూ.56,999 నుంచి ప్రారంభం కానున్నాయి.