మీ పెళ్లికి 10 మందే గెస్టులా.. మా ఇంట్లో డిన్నర్‌ రెడీ: పోలీస్ అధికారి వినూత్న ఆఫర్!

Madhya Pradesh SP offer కరోనా నిబంధనలు గాలికొదిలేసి భారీ సంఖ్యలో అతిథులను వేడుకలకు ఆహ్వానించి మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

ప్రధానాంశాలు:కోవిడ్ కట్టడికి ఎస్పీ వినూత్న ఆలోచన.కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం.డిన్నర్ ఆఫర్ ప్రకటించిన పోలీస్ అధికారి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆంక్షలు, నిబంధనలను ప్రజలు గాలికొదిలేస్తున్నారు. వేడుకలు, వివాహాది శుభకార్యాలకు అతిథులు 50 మందికి మించరాదని నిబంధలు విధించినా పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ పోలీస్ అధికారి నడుం బిగించారు. వినూత్నమైన ఆలోచనతో కరోనాపై అవగాహనకు ముందుకొచ్చిన మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లా ఎస్పీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పది లేదా అంత కంటే తక్కువ మంది అతిథుల నడుమ వివాహం చేసుకునే ఆ జంటకు తన ఇంటిలో విలాసవంతమైన గాలా డిన్నర్‌ ఇస్తానని ఎస్పీ మనోజ్ కుమార్ ప్రకటించారు. అంతేకాదు, ఆ జంటకు ప్రోత్సాహకంగా మెమొంటోలు కూడా ఇస్తామని, వధూవరులను తీసుకెళ్లడానికి ప్రభుత్వ వాహనాన్ని పంపిస్తామని తెలిపారు. అయితే, ఆయన ఈ ప్రకటన చేసి రెండు రోజులైనా ఈ ఆఫర్‌ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

కుర్థారా గ్రామంలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకకు భారీగా అతిథులు హాజరై కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. కనీసం మాస్క్ కూడా ధరించకుండా ఊరేగింపులో పాల్గొని, డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచించిన ఎస్పీ మనోజ్ కుమార్‌.. ఇటువంటివి పునరావృతం కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో వధూవరులకు వినూత్నమైన ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించారు.

‘‘ఏప్రిల్ 30 న వివాహం చేసుకునే రెండు జంటలు అతిథుల సంఖ్యను 10 కి పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు నాకు తెలిసింది.. వారు అలా చేస్తే నేను వారి కోసం నా ఇంటిలోనే నా కుటుంబంతో రెండు విలాసవంతమైన విందులను ఏర్పాటుచేస్తాను’’ అని ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 12,686 మందికి కొత్తగా కొవిడ్‌ నిర్దారణ కాగా.. 88 మంది మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీలో వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త.. బిగ్ రిలీఫ్

Tue Apr 27 , 2021
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.