గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి హెచ్చరిక.. ఇక ఇలా చేస్తేనే మీ ఇంటికి సిలిండర్.. కానీ..

మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డ్యాక్ కోడ్ వస్తుంది. దీన్ని డెలివరీ బాయ్‌కు చెబితేనే సిలిండర్ ఇస్తారు. లేదంటే లేదు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఈ కోడ్‌ను అడగడం లేదు.

ప్రధానాంశాలు:గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా?అయితే మీరు ఇలా చేయాలిఅప్పుడే మీకు సిలిండర్మీకు గ్యాస్ సిలిండర్ ఉందా? మీరు ఇండేన్ గ్యాస్ కస్టమరా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇండియన్ ఆయిల్ తన కస్టమర్లకు ఎన్నో రకాల ఫెసిలిటీలు అందిస్తోంది. వీటిల్లో డ్యాక్ సర్వీసులు కూడా ఒక భాగమని చెప్పుకోవాలి.

మీరు గ్యాస్ సిలిండర బుక్ చేసిన ప్రతి ఒక్కసారి డ్యాక్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. మీరు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను ఇంటికి డెలివరీ పొందాలని భావిస్తే.. ఈ నెంబర్ కచ్చితంగా చెప్పాలి. అప్పుడే డెలివరీ ప్రాసెస్ పూర్తవుతుంది.

Also Read: ధరలు పెరుగుతాయనే భయం అక్కర్లేదు.. ఈ గోల్డ్ స్కీమ్‌తో ఈఎంఐలో తక్కువ ధరకే బంగారం కొనండి!

Also Read: బంగారం కొనే వారికి అదిరిపోయే ఆఫర్.. ఏకంగా 55 శాతం తగ్గింపు!

ఇండియన్ ఆయిల్ కార్ప్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండేన్ గ్యాస్ బుక్ చేసిన ప్రతిసారి డ్యాక్ జనరేట్ అవుతుందని, ఈ నెంబర్‌ను డెలివరీ బాయ్‌కు చెబితే డెలివరీ ప్రాసెస్ పూర్తవుతుందని ఇండియన్ ఆయిల్ తెలిపింది. డెలివరీ అథంటికేషన్ కోడ్‌ని డ్యాక్ అని పిలుస్తారు.

మీర గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ రూపంలో మీకు ఈ కోడ్ వస్తుంది. అంటే ఓటీపీ మాదిరి అని చెప్పొచ్చు. మీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కు ఈ కోడ్ చెప్పాలి. ఇందులో 4 అంకెలు ఉంటాయి. ఒకవేళ ఈ కోడ్ చెప్పకపోతే సిలిండర్ పొందటం సాధ్యం కాకపోవచ్చు. బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు కంపెనీ ఈ విధానాన్ని తెచ్చింది. అయితే చాలా ప్రాంతాల్లో డెలివరీ బాయ్స్ డ్యాక్ కోడ్‌ అడగడం లేదు. రూ.30 డబ్బులు మాత్రం కచ్చితంగా తీసుకుంటున్నారు. తర్వాతనే సిలిండర్ డెలివరీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భారత్‌లో కోవిడ్ ఉద్ధృతం.. బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. నేటి నుంచే అమల్లోకి!

Mon Apr 26 , 2021
Covid in India భారత్‌లో కరోనా వ్యాప్తి వేళ పలు దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై నిషేధం విధించాయి. ఇక్కడ నుంచి వెళ్లే ప్రయాణికుల్లో చాలా మందికి వైరస్ నిర్ధారణ అవుతోంది.