భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ మృతి.. 1983 World Cup మెంబర్

1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన యశ్‌పాల్ శర్మ 32 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులే చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకే అతని కెరీర్…

ప్రధానాంశాలు:భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ మృతి 1983 వరల్డ్‌కప్ గెలిచిన భారత్ జట్టులో మెంబర్ఫైనల్లో 32 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసిన యశ్‌పాల్ శర్మరిటైర్మెంట్ తర్వాత నేషనల్ సెలెక్టర్‌గా బాధ్యతలు భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ (66) మంగళవారం మృతి చెందాడు. 1983లో కపిల్‌‌దేవ్ కెప్టెన్సీలోని భారత్ జట్టు ప్రపంచకప్ గెలవగా.. ఆ జట్టులో మెంబర్‌గా ఉన్న యశ్‌పాల్ శర్మ‌ ఈరోజు ఉదయం తీవ్రమైన గుండె పోటుతో తుదిశ్వాస విడిచాడు. 1979-85లో భారత్ జట్టులో నమ్మదగిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న యశ్‌పాల్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నేషనల్ సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు.

1979లో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యశ్‌పాల్ శర్మ.. అదే ఏడాది వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో 37 టెస్టులు, 42 వన్డేలాడిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. రెండు సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. పార్ట్ టైమ్‌ బౌలర్‌గానూ అప్పట్లో టీమ్‌కి యశ్‌పాల్ శర్మ ఉపయోగపడ్డాడు. కెరీర్‌లో తీసింది రెండు వికెట్లే అయినా.. వన్డేల్లో 5.94 ఎకానమీతో అతను బౌలింగ్ చేయడం విశేషం.

ఆగస్టు 11, 1954లో పంజాబ్‌లో జన్మించిన యశ్‌పాల్ శర్మ.. స్కూల్ టోర్నీల్లో జమ్మూ- కాశ్మీర్ స్కూల్‌పై 260 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే పంజాబ్ టీమ్‌లోకి ఎంపికైన యశ్‌పాల్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తాచాటి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. 1983 వరల్డ్‌కప్‌ ఫైనల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన యశ్‌పాల్ శర్మ 32 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీ సాయంతో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకే అతని కెరీర్ ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.లక్ష పెడితే.. ఏడాదిలోనే చేతికి రూ.8 లక్షలు.. కళ్లుచెదిరే రాబడి!

Tue Jul 13 , 2021
ఒక్క సంవత్సరంలోనే రూ.లక్షకు రూ.8 లక్షలు వచ్చాయంటే.. అది చిన్న విషయం కాదు. వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఇలాంటివి స్టాక్ మార్కెట్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి.