ఫ్రెండ్స్‌తో MS Dhoni లంచ్.. వైరల్‌గా మారిన ధోనీ న్యూలుక్ ఫొటో

క్రికెట్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఉన్న మహేంద్రసింగ్ ధోనీ.. మైదానం వెలుపల చాలా సింపుల్‌గా ఉంటాడు. మరీ ముఖ్యంగా.. ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఈ కెప్టెన్ కూల్

ప్రధానాంశాలు:గత ఏడాది ఆగస్టులో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి ధోనీ గుడ్‌బైరాంచీలోని ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్న ధోనీప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న కెప్టెన్ కూల్ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబరు 19 నుంచి భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన ఫ్రెండ్స్‌‌తో కూర్చుని సింపుల్‌గా లంచ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి దూరమైన ధోనీ.. 2020, ఆగస్టులో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ఎక్కువగా రాంచీలోని ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్న ధోనీ.. అక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న విషయం తెలిసిందే.

ఫామ్‌హౌస్‌లో ధోనీ సంగతుల్ని అప్పుడప్పుడు అతని భార్య సాక్షి సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేయడం తప్ప.. అతని గురించి ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలానే ధోనీ ఫ్రెండ్స్ ఫామ్‌హౌస్‌లో అతడ్ని కలిసిన తర్వాత లేటెస్ట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ.. ధోనీ మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ.. తన ప్రైవేట్ లైఫ్‌ ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా మహేంద్రసింగ్ ధోనీ తన ఫ్రెండ్స్‌తో కలిసి కార్ల గ్యారేజీలో కూర్చుని సింపుల్‌గా లంచ్ చేస్తున్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. నెరిసిన గడ్డంతో ధోనీ నవ్వుతూ ఆ ఫొటోలో కనిపిస్తున్నాడు. భారత్‌కి 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన గొప్ప కెప్టెన్.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

LIC అదిరే స్కీమ్.. రూ.74 పొదుపుతో రూ.10 లక్షలు పొందండిలా!

Wed Jul 14 , 2021
మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అలాగే పన్ను మినహాయింపు, తక్కువ ప్రీమియం, ఆకర్షణీయ రాబడి కోరుకుంటున్నారా? అయితే మీకోసం ఒక పాలసీ అందుబాటులో ఉంది.