బంగాళదుంపల్ని ఇలా తింటే ఎంతో ఆరోగ్యమట..

మనం తీసుకునే ఆహారం, మనం అనుసరించే పద్ధతులు ఆధారంగా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఆరోగ్యం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేది అయ్యి ఉండాలి.

ప్రధానాంశాలు:కొన్ని ఆహారపదార్థాలు తింటే ఆరోగ్యంహెల్దీ ఫుడ్ ఐటెమ్స్ ఏంటో చెబుతున్న నిపుణులుచక్కగా కడుపులో ఏ ఇబ్బంది లేకుండా.. ఏ బాధ లేకుండా ఉండాలి. చాలా మంది ఎక్కువగా చిప్స్, స్వీట్లు, శాండ్విచ్లు, పిజ్జాలు వంటి వాటిని తింటూ ఉంటారు. అయితే వీటి వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి అయితే మనం బయట తినే జంక్ ఫుడ్ వల్ల చాలా కొవ్వు పదార్థాలు మనలో చేరిపోతాయి అదే విధంగా షుగర్ కూడా అందులో ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యానికి మరింత నష్టం కలుగుతుంది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో కుంకుమపువ్వు తీసుకుంటే ఏమవుతుందంటే..
అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనం అలవాటు పడిపోతాం.. అలానే మనం మన చేతులతో ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాము. కాబట్టి ఎప్పుడూ కూడా రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ప్రధానమని తెలుసుకోవాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్స్, ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వల్ల ఒత్తిడి కలుగుతుంది. అదే విధంగా ఆరోగ్యం కూడా క్షీణించింది కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి ఆహారాన్ని అసలు ప్రిఫర్ చేయొద్దు.

మీ పిల్లలకు ఇలాంటి ఆహార పదార్థాలు అలవాటు చేయకపోవడమే మంచిది. శరీరానికి తృప్తి కలిగేది… ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం పోషక విలువలు ఎక్కువగా ఉండే వాటిని తింటే మంచిది. అయితే మరి ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది..?, ఎలా ఆహారం తీసుకోవాలి..? ఇలా ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే మనం పూర్తిగా చూద్దాం.

ఓట్ మీల్ ప్రిపరేషన్స్:

చాలా మంది బరువు తగ్గడానికి ఓట్స్ ని తింటారు. ఎక్కువ మంది బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఓట్స్ తింటారు. అయితే నిజంగా ఓట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. ఓట్స్‌లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. విటమిన్ బి కూడా ఓట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు ఓట్స్‌లో తేనె, నట్స్, పండ్లు వంటి వాటిని వేసుకుని తింటే చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. పైగా ఎలాంటి హాని కూడా కలగదు.

వెజిటేబుల్ సాండ్విచ్ మరియు పాస్తా:

చాలా మంది పాస్తా మరియు శాండ్విచ్ వంటి వాటిని తినడానికి ఎక్కువగా ఇష్ట పడుతుంటారు నోరూరించే ఈ రెసిపీస్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. అదే విధంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తినొచ్చు తప్పులేదు. అయితే వీటిలో ఎక్కువగా సాస్ వంటి వాటిని వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు వీటికి బదులుగా మీరు ఎక్కువ కూరగాయలు వంటి వాటిని వేసి తినొచ్చు. ఎక్కువ కూరగాయలతో పాటు కాస్త స్పైసెస్ వేసుకుని మీరు ఆరోగ్యకరమైన పద్దతిలో చేసుకు తినొచ్చు. దీనితో నష్టం ఏమీ ఉండదు.
టమాటా తింటే కాన్సర్ రాదా..
బేక్ చేసిన బంగాళదుంపలు:

చాలా మందికి బంగాళదుంపలు అంటే బాగా ఇష్టం. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అయినా సరే బేక్ చేసుకుని తినొచ్చు. బంగాళాదుంపల్ని బేక్ చేసి మీకు నచ్చిన రెసిపీస్‌లో టాపింగ్ చేసుకుని తినొచ్చు. ఇలా ఆరోగ్యకరమైన పద్దతిలో వీటిని కూడా మనం డైట్‌లో తీసుకొచ్చు. దీంతో లాభాలు పొంది ఎంతో ఆరోగ్యంగా మనం ఉండచ్చు.

కిచిడి:

చాలా మంది కిచిడీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేశంలో చాలా ప్రాంతాలలో ఈ రెసిపీలని తయారు చేసుకుంటూ ఉంటారు. మంచి పోషక పదార్ధాలతో కిచిడీ తయారు చేసుకుంటే మంచిది. కిచిడిలో మనం కూరగాయలు, పెసరపప్పు మొదలైన వాటిని యాడ్ చేసుకుని ఆరోగ్యకరంగా తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది రాదు పైగా ఆరోగ్యానికి మేలు కూడా.

పెరుగన్నం :

కిచిడి లాగే పెరుగు అన్నం కూడా చాలా ప్రాంతాల్లో తింటారు. పైగా పెరుగు అన్నం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది గట్ ఫ్రెండ్లీ ఫుడ్ మరియు మైక్రోబియల్ బ్యాలెన్స్ చేస్తుంది అదే విధంగా పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పెరుగులో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి పెరుగు అన్నం తింటే కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఏ సమస్య కూడా రాదు.

ఫాక్స్ నట్స్ మరియు పాప్ కార్న్ :

ఫాక్స్ నట్స్‌ని మఖాన అంటారు. మఖాన కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బటర్ లేకుండా మీరు పాప్ కార్న్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ప్రయోజనాన్ని ఇస్తుంది. జీర్ణ ప్రక్రియలో కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే మఖానని మనం ఎన్నో విధాలుగా తయారు చేసుకోవచ్చు దీని కోసం అందరికీ తెలుసు పెద్దగా చెప్పక్కర్లేదు.
ఈ లక్షణాలు ఉంటే షుగర్ ఉన్నట్లేనట..
ఇదిలా ఉంటే ముఖానలో క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. దీనితో చక్కటి ప్రయోజనాలను అంధిస్తుంది. కనుక ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారానికి బదులుగా బటర్ లేకుండా పాప్ కార్న్ కానీ మఖానా తో హెల్తీ రెసిపీస్ ని చేసి కానీ తినండి. ఇలా మీరు పాటిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏ సమస్య కూడా కలగదు.

పెరుగు మీద పండ్లు వేసుకుని తీసుకోవచ్చు :

పెరుగు మీద పండ్లు వేసుకుని కూడా తీసుకోవచ్చు. యోగర్ట్‌లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. గట్ బ్యాక్టీరియాకి మేలు చేస్తుంది. అలానే ఇందులో క్యాల్షియం కూడా ఎక్కువగా వుంటుంది. అదే విధంగా బరువు తగ్గడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. యోగర్ట్ పైన మీకు నచ్చిన పండ్లని వేసుకుని తీసుకుంటే కూడా రిలాక్స్ గా ఉంటుంది పైగా ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

చూసారు కదా ఎలాంటి ఆహార పదార్థాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది. అలానే ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి కలుగుతుందో తెలిసింది కదా.. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంలో ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని మంచి ఆహారం తీసుకుని కాపాడుకోవాలి. అనారోగ్య సమస్యలు వచ్చాయంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి హాని చేసే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోండి. అలానే ప్రతీ రోజు వ్యాయామం, ఒత్తిడి లేకుండా ఉండడం, నీళ్లు ఎక్కువ తాగడం, వేళకి తినడం, నిద్ర వంటి వాటిపై కూడా శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. అలానే ప్రతి రోజూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది దీనితో మీరు ఆనందంగా ఉండొచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

విమానం గాల్లో ఉండగా పేలిపోయిన సామ్‌సంగ్ గేలాక్సీ ఏ21.. అత్యవసర ల్యాండింగ్

Thu Aug 26 , 2021
అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్‌కు వెళుతున్న ఓ విమానంలో ప్రయాణికుడు వద్ద మొబైల్ ఫోన్ పేలిపోవడంతో మంటలు చేలరేగాయి. దీంతో విమానం తక్షణమే దింపేశారు.